శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య మీడియా ఫోకస్ పెంచుకుంటున్నారు. ఉత్తరాంధ్రా వాణిని తనదైన బాణిలో గట్టిగా వినిపిస్తున్నారు. అంతే కాదు ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు. చంద్రబాబు అమరావతి రాజధానికే ఓకే చెబితే తాను విశాఖ కేంద్రంగా కొత్త రాష్ట్రం కోరుకోవడంలో తప్పేముంది అంటూ లేటెస్ట్ గా మరోసారి ధర్మాన రీ సౌండ్ చేశారు.
తన గొంతును ఎవరూ ఆపలేరంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. తనకు రాజకీయాలు పదవులు సైతం వద్దు అంటున్నారు. అవసరమైతే మంత్రి ఎమ్మెల్యే పదవులను సైతం వదిలేస్తాను తప్ప తాను గొంతు ఎత్తకుండా ఉండని అంటున్నారు. తాను ఉత్తరాంధ్రా గురించి మాట్లాడితే తనను అవినీతి పరుడు అంటారా ఆయన గుస్సా అవుతున్నారు. తాను చేసిన అవినీతి గురించి చెప్పండి అని సవాల్ చేస్తున్నారు.
ఇలా ధర్మాన గట్టిగా మాట్లాడడం వెనక రీజన్ ఏంటి అన్న చర్చ అయితే బయల్దేరింది. ఆయన మంత్రి పదవిని ఎమ్మెల్యే సీటుని వదిలేస్తాను అంటున్నారు అంటే అది వైసీపీ హై కమాండ్ కి కూడా హెచ్చరికగా భావించాలా అన్న డౌట్లు వస్తున్నాయి. తన గొంతు ఎవరూ నొక్కలేరు అంటున్నారు అంటే తెలుగుదేశంతో పాటు వైసీపీ అధినాయకత్వానికి ఆయన ఈ విధంగా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారా అన్న చర్చ వస్తోంది.
ధర్మాన మరో మాట అంటున్నారు. తాను జస్ట్ రెవిన్యూ మినిస్టర్ ని మాత్రమే తాను సెంట్ భూమి కూడా ఇవ్వలేనని, అంతా క్యాబినేట్ డెసిషన్ తోనే అవుతుందని. అంటే తనకు ఉన్న అధికారాల పట్ల ధర్మాన ఏమైనా అసంతృప్తికి లోను అవుతున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక ధర్మానా మరో మాట అంటున్నారు. చంద్రబాబుతో తాను సవాల్ చేస్తున్నాను అని. తన నిజాయతీని నిరూపించుకునేందుకు రెడీ అని. చంద్రబాబు ఎన్ని అక్రమాలు చేశారో నిరూపిస్తాను అంటున్నారు.
తాను తప్పు చేసినట్లుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ధర్మాన అంటున్నారు. మొత్తానికి ధర్మాన సౌండ్ చేస్తున్నారు. టోన్ పెంచేశారు. మరి దీని వెనక మ్యాటర్ ఏంటి అన్నది వైసీపీలో కూడా హాట్ టాపిక్ గా ఉంది. ధర్మాన ఈ మధ్యనే విశాఖకు రాజధాని కావాలని అన్నారు. లేకపోతే ఉత్తరాంధ్రా స్టేట్ అన్నారు.
దాని మీద వైసీపీ హై కమాండ్ విభేదించింది అని గుర్రుగా ఉందని వార్తలు వచ్చాయి. ధర్మానను తగ్గమని అన్నట్లుగా కూడా చెప్పుకున్నారు. ఇక సీనియర్ మంత్రి, ఉత్తరాంధ్రాకు చెందిన బొత్స సత్యనారాయణ అయితే రాజధాని తప్పకుండా విశాఖకు వస్తుంది ఇందులో ఎవరూ ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడారు. మరి ధర్మాన ఈ విషయాల మీద ఏమైనా హర్ట్ అయ్యారా లేక సొంత పార్టీలో తన ఉత్తరాంధ్రా వాదనకు విశాఖ రాజధాని మీద తన కమిట్మెంట్ కి సరైన సపోర్ట్ రాలేదని మధన పడుతున్నారా అన్నది తెలియడం లేదు.
ఏది ఏమైనా మంత్రి పదవి రాలేదని అప్పట్లో ధర్మాన కామెంట్స్ కొన్ని చేశారని అంతా అనుకున్నరు. ఇపుడు మంత్రి అయ్యాక కూడా ఆయన కాక పెంచుతున్నారు. దాంతో వైసీపీ అధినాయకత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ సీనియర్ నేత, మంత్రి తరచూ మీడియాకు ఫోకస్ అవుతూ పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారా అన్న చర్చ అయితే వస్తోంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.