అప్పుల ఊబిలో చిక్కుపోయిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ ఎఫ్ ఎల్) బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం ఈ కంపెనీ పై త్వరలోనే విచారణ జరపనుంది. అయితే , ఎదో విచారణ చేసి వదిలేస్తారు అని అంతా అనుకున్నారు కానీ , అసలు ట్విస్ట్ ఇక్కడే ..ఆర్బీఐ దీనిపై విచారణ ఒక్కసారి ప్రారంభిస్తే .. dhfl కంటే ఈ సంస్థకి అప్పులు ఇచ్చిన బ్యాంకులకు ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో లోన్స్ ని రైటాఫ్ చేయాల్సి వస్తుంది. డీహెచ్ ఎఫ్ ఎల్‌కు ఇచ్చిన అప్పుల్లో మోసం జరిగిందని తేలితే వాటికి ప్రొవిజన్ చేయాల్సిందిగా ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. అంటే రూ.38 వేల కోట్లకు ప్రొవిజనింగ్ చేయాలి. ఇదే కనుక జరిగితే బ్యాంకులకు భారీ షాక్ తప్పదు అని చెప్పాలి.
అంతర్జాతీయ అకౌంటింగ్ కంపెనీ కేపీఎంజీ డీహెచ్ ఎఫ్ ఎల్ లోన్ల పై ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఆర్ బీఐ తదుపరి చర్యలు తీసుకోనుంది. డీహెచ్ ఎఫ్ ఎల్ లో అవకతవకలపై కేపీఎంజీ ఇది వరకే మధ్యంతర రిపోర్టు ఇచ్చింది. కంపెనీ ఫౌండర్ కంపెనీలకు డీహెచ్ ఎఫ్ ఎల్ రూ.16,500 కోట్ల లోన్లు ఇవ్వడంతో అక్రమాలు జరిగాయని, ఈ ఎన్ బీ ఎఫ్ సీ బ్యాంకుల నుంచి రూ.38 వేల కోట్ల లోన్లు తీసుకోగా, ఇందులో నుండి కేవలం ప్రమోటర్ కంపెనీలకే రూ.16 వేల కోట్లు ఇవ్వడం ముఖ్య విశేషం. దీన్ని బట్టి ..ఒకవేళ ఆర్బీఐ డీహెచ్ ఎఫ్ ఎల్ ఖాతాను ఫ్రాడ్ అకౌంట్‌గా గుర్తిస్తే బ్యాంకులకు ఇబ్బందులు తప్పవు. వేల కోట్ల రూపాయలను ప్రొవిజనింగ్‌కు కేటాయించాల్సిందే అని కేర్ రేటింగ్స్ లిమిటెడ్ సీనియర్ ఆఫీసర్ మితుల్ బుధ్‌భట్టి తెలిపారు.
ప్రస్తుతం మనదేశంలో ఉన్న బ్యాంకుల మొండిబాకీల విలువ 130 బిలియన్ డాలర్లు . దీనితో పాటుగా డీహెచ్ ఎఫ్ ఎల్ బాకీలను రద్దు చేస్తే ఇవి 135 బిలియన్ డాలర్లకు చేరుతాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్ అక్రమంగా లోన్లు ఇవ్వలేదని కేపీఎంజీ తేల్చితే మాత్రం బ్యాంకులపై కేవలం రూ.5,500 కోట్ల భారం పడుతుందని మితుల్ చెప్పారు. లోన్లు తీసుకున్న ప్రమోటర్ల కంపెనీలు పెద్దగా వ్యాపారం ఏమీ చేయడం లేదని కేపీఎంజీ వెల్లడించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ నిర్ణయాలు కంపెనీ చట్టం ప్రకారమే తీసుకున్నారా లేదా అనే విషయాన్ని తేల్చడానికి మరింత లోతుగా దర్యాప్తు చేయడం అవసరమని కేపీఎంజీ స్పష్టం చేసింది. అయితే మొత్తం లోన్లకు కాకుండా, మోసపూరిత ఖాతాలుగా తేలిన వాటికి మాత్రమే ప్రొవిజనింగ్ చేసేలా మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులు ఆర్‌బీఐని కోరే అవకాశాలు ఉన్నాయి.