పంజాబ్ లో అత్యంత కీలకమైన మాల్వా ప్రాంతంపైనే అన్ని పార్టీలు గురిపెట్టాయి. ఈ ప్రాంతంలో ఏ పార్టీ అయితే అత్యధికంగా సీట్లు గెలుచుకుంటుందో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ బలంగా ఉంది. పైగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చితే మాల్వా ప్రాంతంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ. అందుకనే ప్రతిపార్టీ అధినేత ఒకటికి రెండు మూడు సార్లు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు.
ఇక్కడ విషయం ఏమిటంటే పంజాబ్ లో మాల్వా, మాఝా, దొవాబా అనే ప్రాంతాలున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 117 సీట్లలో మాల్వాలో 69 సీట్లున్నాయి. మాఝాలో 25 సీట్లు, దొవాబాలో 23 సీట్లున్నాయి. అంటే మిగిలిన రెండు ప్రాంతాలకన్నా మాల్వాలోనే రెట్టింపు సీట్లున్న విషయం అర్ధమైపోతోంది. 2012 ఎన్నికల్లో మాల్వా ప్రాంతంలో శిరోమణి అకాలీ దళ్ 34 సీట్లు దక్కించుకుంది. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ 31 సీట్లతో నిలిచింది.
అదే 2017 ఎన్నికలు వచ్చేసరికి అకాలీదళ్ కేవలం 8 సీట్లకే పరిమితమైపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 18 సీట్లు గెలిస్తే మిగిలిన 40 సీట్లను కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది. దాంతో కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చింది. అందుకనే ఇపుడు అన్నీ పార్టీలు ఈ ప్రాంతంపైనే గట్టిగా గురిపెట్టాయి. విచిత్రమేమిటంటే రాష్ట్రంలోనే ఇంతటి కీలకమైన ప్రాంతం మాఝా, దొవాబా కన్నా అన్నీ విధాలుగా వెనకబడుండటమే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వెనకబాటు అయితే అలాగే ఉంటోంది.
మాల్వా ప్రాంతంలో మొదటి నుంచి కూడా భారతీయ కిసాన్ యూనియన్ కు పట్టెక్కువ. కిసాయన్ యూనియన్ కు అనుబంధంగా మరికొన్ని యూనియన్లు పనిచేస్తున్నాయి. అన్ని యూనియన్లలోను లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతం రైతులే ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ ఎన్నికలో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే సంప్రదాయ పార్టీలే కాకుండా రైతుల పార్టీ కూడా పోటీచేస్తోంది. అందుకనే రైతుల ఓట్లు ఎవరికి పడతాయో అర్థం కావటం లేదు.