అమెరికానే ‘కిల్ లిస్ట్’ అందించిందా ?

Update: 2021-08-28 08:31 GMT
గడచిన 20 ఏళ్ళుగా ఆఫ్ఘనిస్ధాన్లో తమకు సహకారం అందించిన ఆప్ఘనిస్థాన్ వాళ్ళ జాబితాను స్వయంగా అమెరికానే తాలిబన్లకు అందించిందా ? ఇపుడేది అంశం ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారింది. ఆఫ్ఘనిస్ధాన్ను స్వాధీనం చేసుకున్న రోజునుండి తాలిబన్లు ఓ జాబితాను పట్టుకుని ప్రతి ఇల్లు సోదాలు చేస్తున్నారని అందరికీ తెలిసిందే. తమకు వ్యతిరేకంగా అమెరికాకు సాయం చేసిన వారిని పట్టుకుని ఇప్పటికే తాలిబన్లు కొందరిని చంపేశారు.

అందరికీ తెలిసేట్లుగా కొందరికి రోడ్లపైన ఉరివేస్తే మరికొందరని బహిరంగంగా అందరిముందు కాల్చి చంపేశారు. చంపేముందు వీళ్ళు చేసిన తప్పేమిటో చెప్పి మరీ చంపటం కలకలం రేపింది. అసలు ఏ ఆధారాలతో తాలిబన్లు జనాలను చంపుతున్నారో ముందు ఎవరికీ అర్ధంకాలేదు. అయితే తాజాగా బయటపడిన విషయం విన్న తర్వాత ప్రపంచదేశాలు విస్తుపోతున్నాయి. అదేమిటంటే స్వయంగా అమెరికానే తాలిబన్లకు పెద్దజాబితాను అందించిందట. గడచిన 20 ఏళ్ళల్లో తమకు వివిధ రూపాల్లో  సహకరించిన స్ధానికుల పేర్లను వాళ్ళ అడ్రస్సులతో సహా తాలిబన్లకు అమెరికా అందించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరోక్షంగా అంగీకరించారు. తాజాగా వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో జాబితా అందించిన ప్రశ్నపై బైడెన్ పరోక్షంగా అంగీకరించారు. అమెరికా చేసిన పనే ఇఫుడు ‘కిల్ లిస్ట్’ అనే పేరుతో ప్రపంచంలో బాగా పాపులరైంది.

ఆఫ్ఘనిస్థాన్ నుండి వెళిపోతున్న అమెరికా తాలిబన్లకు కిల్ లిస్ట్ ఎలా అందించిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. తాము జాబితాను అందించిన తర్వాత ఆ జాబితాను పట్టుకుని తాలిబన్లు ఏమి చేస్తారో అంతమాత్రం అమెరికా ఊహించలేకపోయిందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. తాజా బ్లండర్ తో అమెరికా చేసిన, చేస్తున్న తప్పులు పెరిగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ను ఖాళీ చేసేయాలన్న తొందరలో అమెరికా ఇప్పటికే చాలా తప్పులు చేసింది. ఆ తప్పులన్నీ తాలిబన్లకు వరాలుగా మారిపోతున్నాయి.
Tags:    

Similar News