చంద్రబాబు తప్పు చేశారా ?

Update: 2021-12-25 02:30 GMT
క్షేత్ర స్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా విజయవాడ ఎంపీ కేశినేని నానికి బాధ్యతలు అప్పగించారు. దాంతో ఇంతకాలం ఆ బాధ్యతలను చూసిన మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, సీనియర్ నేత నాగుల్ మీరా వర్గాలు చంద్రబాబు మీద మండిపోతున్నాయి. విజయవాడ పార్టీలో మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, బుద్ధా, మీరా ఒకవర్గంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళకు వ్యతిరేక వర్గం కేశినేని.

పై రెండు వర్గాలకు ఏ విషయంలో కూడా పడదు. అలాంటిది ఇపుడు ఎంపీని మంచి చేసుకునేందుకు ఏకంగా ముగ్గురు నేతలను చంద్రబాబు దూరం చేసుకున్నారు. పోనీ ఎంపీ ఏమన్నా పార్టీకి లాయల్ గా ఉన్నారా ? అధినేతకు లాయల్ గా ఉన్నారా ? అంటే అదీలేదు. ఎప్పటికప్పుడు సంచలనాల కోసం నోటికేదొస్తే అదంతా మాట్లాడేస్తుంటారు. తనికిష్టమైతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు లేకపోతే అసలు అడ్రస్సే ఉండరు. చివరక చంద్రబాబు ఫోన్ చేసినా తనకిష్టమైతేనే మాట్లాడుతారు.

అదే వైరివర్గంలోని ముగ్గురు నేతల విషయం చూస్తే చంద్రబాబుకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా రెగ్యులర్ గా పాల్గొంటారు. నిజానికి కేశినేని నేని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళిపోతారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ఎంపీ ఎంతకాలం పార్టీలో ఉంటారో పార్టీ నేతలకే సరిగ్గా తెలీదు. అలాంటి ఎంపీ కోసమని చంద్రబాబు ముగ్గురు నేతలను ఎందుకు పక్కన పెట్టేశారో అర్ధం కావటంలేదు.

అసలు ఇన్చార్జిలు లేని నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. వాటి పైన దృష్టిపెట్టి నేతలందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి ఇన్చార్జీలను ప్రకటించాల్సిన అవసరం చాలావుంది. చంద్రబాబు ముందు ఆపని చేయకుండా ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేసుకుపోతున్న వారిని ఎందుకు డిస్ట్రబ్ చేసినట్లు ? తన సొంత జిల్లా చిత్తూరులోనే చిత్తూరు, చంద్రగిరి, సత్యవేడు లాంటి నియోజకవర్గాల్లో పెద్ద దిక్కు లేకుండా కార్యకర్తలు నానా అవస్తలు పడుతున్నారు. ముందు అలాంటి వాటి సంగతి చూస్తే పార్టీ బలోపేతమవుతుంది. అంతేకానీ కోరి డిస్ట్రబ్ చేస్తే పార్టీ బలహీనపడుతుందని చంద్రబాబుకు తెలీదా ?
Tags:    

Similar News