రిపబ్లిక్ డే వేళ దేశ రాజధానిలో రైతుల ఉద్యమం పేరుతో జరిగిన రచ్చకు సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ట్రాక్టర్ల ర్యాలీ పేరుతో కొందరు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించినట్లుగా తీవ్ర ఆరోపణల్ని మూటకట్టుకున్న పంజాబీ నటుడు దీప్ సిద్దూ ఇప్పుడెక్కడ? అన్నది ప్రశ్నగా మారింది. బాలీవుడ్ నటుడు కమ్ బీజేపీ ఎంపీ సన్నిడియోల్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న దీప్ సిద్ధూ ఇప్పుడు కనిపించటం లేదు.
ఆయన్ను జనవరి 26న ఎర్రకోట దగ్గర ఆందోళనాకారులతో కలిసి కనిపించిన సిద్దూ.. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో అక్కడ నుంచి బైక్ మీద వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమేరాల పుటేజ్ వైరల్ గా మారింది. ట్రాక్టర్ల ర్యాలీపై ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ చేసిన సిద్దూ.. ఆందోళనకారులు ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేయటాన్ని సమర్థించుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
తాము జాతీయ పతాకాన్ని తొలగించలేదని.. ఉద్యమానికి గుర్తుగా సిక్కు మత చిహ్నమైన నిశాన్ షాహిబ్ జెండాను పెట్టినట్లుగా పేర్కొన్నారు.ఈ ఘటన జరిగిన తర్వాత సిద్ధూ కనిపించకుండా పోయారు. ఇప్పుడాయన ఆచూకీ కూడా లభించని పరిస్థితి. రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు నిర్వహించిన ర్యాలీలో చోటు చేసుకున్న పలు ఘటనలపై పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. ఎర్రకోట ఎపిసోడ్ కు సంబంధించి సిద్దూకు నోటీసులు జారీ చేస్తారని చెబుతున్నారు.
పంజాబ్ కు చెందిన దీప్ లా డిగ్రీ చేశారు. మోడల్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత నటుడిగా పలు పంజాబీ చిత్రాల్లో నటించాడు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. అయితే.. అతడి పాత్రను రైతు సంఘాలు మొదట్నించి అనుమానిస్తూనే ఉన్నాయి. అతడు వాస్తవ సమస్యల్ని పక్కదారి పట్టిస్తారన్న భయాన్ని వ్యక్తం చేసేవారు. వారి భయాలకు తగ్గట్లే.. ఆయన తీరు ఉండేది. మార్టిన్ లూథర్ కింగ్.. సిక్కు వేర్పాటువాది భింద్రన్ వాలేలను దీప్ సిద్దూ తరచూ ప్రస్తావించేవారు. రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట మీద జాతీయ జెండా పక్కన మతపరమైన జెండాను ఎగురవేయటం పెను సంచలనంగానూ.. వివాదాస్పదంగానూ మారింది. దీప్ కోసం పోలీసుల వెతుకులాట మరింత ముమ్మరమైంది.