మూడు రాజ‌ధానుల‌కు జ‌గ‌న్ ముగింపు ప‌లికిన‌ట్టేనా...?

Update: 2022-07-14 04:10 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటున్న కీల‌క విష‌యంలో.. కేంద్రం నుంచి ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న ల్ ల‌భించిందా?  త్వ‌ర‌లోనే ఆయ‌న త‌న కోరిక‌ను నెర‌వేర్చుకునే ఉద్దేశంతో ఉన్నారా? అంటే.. ఔన‌నే అం టున్నారు పరిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇవ్వ‌క‌పోయినా.. జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తెచ్చారు. క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని, విశాఖ‌లో ప్ర‌ధాన పాల‌నా రాజ‌ధాని, అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధాని.. ఇలా ఆయ‌న ఏకంగా అసెంబ్లీలోనే ప్ర‌క‌టించారు.

అయితే..న్యాయ ప‌ర‌మైన  చిక్కుల‌తో ఇది ముందుకు సాగ‌లేదు. పైగా అమ‌రావ‌తిని డెవ‌ల‌ప్ చేసి ఇవ్వా ల్సిందేన‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌బుత్వానికి కాళ్లు చేతులు క‌ట్టేసిన‌ట్టు అయిపో యింది. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా.. అనుకున్న‌ది సాధించ‌లేక పోయార‌నే అప‌వాదు.. జ‌గ‌న్‌ను వెంటాడుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న కేంద్రం వ‌ద్ద చ‌క్రం తిప్పార‌నే గుస‌గుస‌ వినిపిస్తోం ది. అన్నీ కాక‌పోయినా..క‌నీసం క‌ర్నూలు విష‌యంలో కేంద్రాన్ని ఒప్పించార‌ని అంటున్నారు.

దీనిని బ‌ట్టి క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధానిగా ప్ర‌క‌టించే అంశంపై ఆయ‌న కేంద్రం ద‌గ్గ‌ర గ్రీన్ సిగ్న‌ల్ తె చ్చుకున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఉన్న న్యాయ‌స్థానాన్ని మార్చేందుకు రాష్ట్ర‌ప‌తి అంగీకారం తెల పాల్సి ఉంటుంది. ఈ ప్ర‌క్రియ‌కు కేంద్రం ఓకే చెబితే.. రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం చేసేస్తుంది. సో.. ఈ విష యంలో జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌కు కేంద్రం ప‌చ్చ‌జెండా ఊపింద‌ని స‌మాచారం. దీనిలో బీజేపీకి కూడా ల‌బ్ధి ఉంద ని అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ .. క‌ర్నూలు ను న్యాయ‌రాజ‌ధానిగా ప్ర‌క‌టించింది. తాము అధికారంలోకి వ‌స్తే.. సీమ‌ను అభివృద్ధి చేస్తామ‌ని కూడా హామీ ఇచ్చింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ డిమాండ్ పెండిం గులో ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ద‌తు అత్యంత కీల‌క‌మైన నేప‌థ్యంలో కేంద్రం ఉభ‌య కుశ‌లోప‌రిగా ఉంటుంద‌ని.. ఈ నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేసిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబు తున్నాయి. క‌ర్నూలు న్యాయ రాజ‌ధాని విష‌యంలో చిక్కులు తొలిగి పోయిన‌ట్టేన‌ని అంటున్నారు.

ఇక, విశాఖ రాజ‌ధాని విష‌యంలో మాత్రం కోర్టు ఉత్త‌ర్వులు ఉన్నాయి. ఈ క్ర‌మంలో అక్క‌డకు అధికారి కంగా వెళ్లిపోకుండా.. తాను అక్క‌డే ఉండి.. అక్క‌డ నుంచి పాల‌న నిర్వ‌హిస్తే.. అదే ఆటోమేటిక్‌గా రాజ‌ధా ని అవుతుంద‌నే వ్యూహంతో జ‌గ‌న్ అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో ఆయ‌న త్వ‌ర‌లోనే విశాఖ‌లో ఉండేలా ప‌క్కా ప్లాన్ రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఎలాగూ.. జ‌గ‌నే చెప్పిన‌ట్టు.. అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌దాని అలానే ఉంటుంది. సో.. మొత్తానికి కేంద్రాన్ని ఒప్పించ‌డం ద్వారా.. ఒకే దెబ్బ‌కు మూడు రాజ‌ధానుల అంశానికి ముగింపు ప‌లికిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News