నిమ్మగడ్డతో ఫైట్.. జగన్ కు మోడీ హెల్ప్ చేశారా?

Update: 2021-01-10 07:34 GMT
ఏపీలో ‘పంచాయితీ’ని కేంద్రమే తీర్చిందా? ఎన్నికల రచ్చకు మోడీ పరిష్కారం చూపారా? జగన్ సర్కార్ కు సాయం చేశారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.మోడీ సర్కార్ ఇప్పటికే దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లకు ఆమోదముద్ర వేసింది. వాటిని ఈనెల 16వ తేది నుంచి దశలవారీగా దేశ ప్రజలకు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు.

ఈ క్రమంనే కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ ను సాకుగా చూపించి ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని ఇప్పటికే జగన్ సర్కార్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హెల్త్ వర్కర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులను పెద్ద సంఖ్యలో అవసరం ఉండగా.. అదే సమయంలో పంచాయితీ ఎన్నికల కోసం సిబ్బందిని అందుబాటులో ఉంచడం సాధ్యం కాదని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం బలంగా వాదన వినిపిస్తోంది. వాక్సినేషన్ ను బూచీగా చూపించి జగన్ సర్కార్ వాయిదా వేస్తోంది.

వచ్చేనెల 5వ తేది నుంచి రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల కోడ్ విధించారు. సోమవారం ప్రారంభం కానున్న అమ్మఒడి పథకాన్ని ఆపాలని చూస్తున్నారు. మరి జగన్ సర్కార్ దీన్ని ఎలా ఎదుర్కొంటుందనేది వేచిచూడాలి.



Tags:    

Similar News