కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో దేశంలో వేలాదిమంది చనిపోయారు. ఈ మరణాలతో యావత్ దేశం అట్టుడికిపోయింది. సెకండ్ వేవ్ లో మరణాలకు కారణం ఏమిటి ? ఏమిటంటే ప్రధానంగా రోగులకు ఆక్సిజన్ అందకపోవటమే అని అప్పట్లో చాలా ఆసుపత్రుల యాజమాన్యాలు తేల్చాయి. మీడియా కూడా అలాగే వార్తలను, కథనాలను అందించింది. దేశం మొత్తాన్ని ఆక్సిజన్ కొరత తీవ్రంగా పట్టిపీడించింది.
కేరళ, ఒడిస్సా, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, తమిళనాడు లాంటి చోట్ల నుండి ఆక్సిజన్ ఉత్పత్తి చేయించి మిగిలిన దేశానికి కేంద్ర ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన సరఫరాకు ఏర్పాట్లు చేసింది. అప్పట్లో కొన్ని రాష్ట్రాల్లో ఆసుపత్రులకు అనుబంధంగా ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను కూడా కేంద్రం మంజూరు చేసింది.
అప్పట్లో దేశమంతా ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయిన రోగుల విషయంలో అల్లాడిపోయింది. ఇదంతా కేవలం మీడియాలో కనబడిన కథనాలే. మీడియాలో కవర్ కాని వార్తలు, కథనాలు ఎన్నున్నాయో తెలీదు.
ఆక్సిజన్ కొరత అప్పట్లో దేశాన్ని ఇంతగా అల్లల్లాడించేస్తే ఇపుడు కేంద్రం తయారుచేసిన రిపోర్టులో ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో ఒక్కరు కూడా చనిపోలేదని ఉంది. ఈ విషయంలో కేంద్రంపై పార్లమెంటరీ స్ధాయీ సంఘం తీవ్రస్ధాయిలో మండిపడింది.
ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్రం చెప్పటాన్ని సంఘం తప్పుపట్టింది. మరప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలు, కథనాలంతా తప్పేనా అంటు కేంద్రాన్ని సంఘం నిలదీసింది. ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరు తమ దగ్గర చనిపోలేదని 20 రాష్ట్రాల నుండి తమకు నివేదికలు అందినట్లు రిపోర్టులో కేంద్రం స్పష్టంగా చెప్పింది. దీన్నే స్ధాయీ సంఘం తీవ్రంగా తప్పుపడుతోంది.
అప్పట్లో ఆక్సిజన్ కొరతతోనే చనిపోయినట్లు ఘటనలు జరిగినపుడు కలెక్టర్లు, ఆసుప్రతుల యాజమాన్యాలు, డ్యూటీ డాక్టర్లు తేల్చిన విషయంపై సంఘం కేంద్రాన్ని నిలదీసింది. అయితే స్ధాయీ సంఘంలోని సభ్యులు ఎంత ఆగ్రహం వ్యక్తంచేసినా ? ఎన్నిసార్లు నిలదీసినా కేంద్రం మాత్రం తాను చెప్పదలచుకున్నదాన్నే మళ్ళీ మళ్ళీ చెబుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.