ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మమత రాజ్యంలో అన్ని అత్యాచారాలా?

Update: 2021-06-14 12:30 GMT
దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బంపర్ మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే. అంచనాలకు మించి ఫలితాలు వెలువడటం ఒక ఎత్తు అయితే.. ఎన్నికల్లో ఆ పార్టీకి సంపూర్ణ విజయం దక్కనీయకుండా చేయటంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. టీఎంసీ అధినేత్రి కమ్ సీఎం హోదాలో బరిలోకి దిగిన మమతా బెనర్జీ ఓటమి పాలు కావటం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చాక బెంగాల్ లో చెదురు ముదురు సంఘటలు చోటు చేసుకుంటున్నట్లుగా వార్తలు రావటం.. రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి కొన్ని దారుణ ఘటనలు వచ్చినప్పటికి అవేమీ పూర్తిస్థాయిలో మీడియాలో రాలేదనే విమర్శ ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బీజేపీ కార్యకర్తల బంధువుల నుంచి పిటిషన్లను స్వీకరించింది. దీంతో.. పలువురు టీఎంసీ కార్యకర్తలు చేసిన ఆరాచకాలు బయటకు వస్తున్నాయని చెప్పాలి. అంతేకాదు మైనర్ మేజర్ అన్న తేడా లేకుండానే కాదు.. పెద్ద వయస్కుల్ని (60 ఏళ్ల మహిళల్ని) కూడా గ్యాంగ్ రేప్ లకు పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నారు.

తనకు ఎదురైన దారుణ అనుభవం గురించి ఒక మహిళ వివరిస్తూ.. ''ఖేజురిలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. వందకు పైగా టీఎంసీ కార్యకర్తలు మే 3న మా ఇంటిని చుట్టుముట్టారు. బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. దీంతో మా కోడలు భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మే 4 రాత్రి ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు ఇంట్లోకి ప్రవేశించారు. మంచానికి కట్టేశారు. ఆరేళ్ల వయసున్న మా మనమడు కళ్ల ఎదుటే గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు'' అంటూ వాపోయింది.  

ఇలాంటి ఉదంతాలు బెంగాల్ వ్యాప్తంగా చాలానే చోటు చేసుకున్నాయని.. కొందరైతే అసోంలోకి పారిపోయి తలదాచుకున్నట్లుగా చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవటానికి.. వారిని దారుణంగా అవమానించటానికి టీఎంసీ కార్యకర్తలు ఇలాంటి రాక్షస చర్యలకు పాల్పడినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై సుప్రీం పర్యవేక్షణలో సిట్ దర్యాప్తును జరిపించాలని కోరారు. రాష్ట్రపతి కోవింద్ కు లేఖ రాశారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఉదంతాలపై విచారణకు ఓకే చెప్పింది. ఏమైనా.. పార్టీ ఏదైనా ఇంత దారుణాలు మాత్రం చోటు చేసుకోకూడదు.
Tags:    

Similar News