ట్విటర్ దెబ్బ టెస్లా మీద పడిందా?

Update: 2022-12-22 10:47 GMT
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారింది ప్రపంచంలోనే కుబేరుడు ఎలన్ మస్క్ పరిస్థితి. ట్విటర్ కొనుగోలు దెబ్బకు ఆయన నంబర్ 1 కుబేరుడి ర్యాంకు గల్లంతైంది. అంతేకాదు.. ఇన్నాళ్లు ఆయనను నిలబెట్టిన టెస్లా షేర్లు కూడా పడిపోతున్నాయి. మస్క్ ఆస్తి మొత్తం ట్విటర్ దెబ్బకు ఆవిరి అవుతోంది. రెండో స్థానం కూడా కోల్పోయి మూడోస్థానానికి పడిపోయే ప్రమాదంలో పడ్డాడు.

వచ్చే త్రైమాసికంలో ఎలక్ట్రిక్-కార్ల తయారీ సంస్థ టెస్లా  కంపెనీలో మరో వేవ్ లేఆఫ్‌లు రాబోతున్నాయని న్యూస్ వెబ్‌సైట్ ఎలెక్ట్రెక్ బుధవారం బాంబు పేల్చింది.  ఈ విషయం గురించి తెలిసిన అందరూ అవాక్కవుతున్న పరిస్థితి నెలకొంది..

ఇది కొత్తగా నియామకాలను కూడా   ఫ్రీజ్‌ చేశారని.. నియామకాలు ఆపేసి మరీ తొలగింపులు టెస్లాలో  అమలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నారు. దీంతో టెస్లా స్టాక్ కొత్తగా 52 వారాల కనిష్టానికి పడిపోయిన తర్వాత  ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

జూన్‌లో ముందుగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఎగ్జిక్యూటివ్‌లను "అన్ని నియామకాలను పాజ్ చేయమని" ,10% సిబ్బందిని తగ్గించమని కోరారు.

అక్టోబరులో $44 బిలియన్లకు కొనుగోలు చేసిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను నిర్వహించడంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలోన్ మస్క్ తలమునకలు అయ్యి టెస్లాను గాలికి వదిలేశాడు. టెస్లా షేర్లను ట్విటర్ ను కొనేందుకు అమ్మేశాడు. ఆ  పరధ్యానంపై టెస్లా పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేసిన సమయంలో ఆ షేర్లు భారీగా పతనమయ్యాయి.

అంతేకాకుండా టెస్లా విశ్లేషకులు కూడా చైనా నుండి డిమాండ్‌ పడిపోయిందని బయటపెట్టారు. ఈ బలహీనత వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల డెలివరీలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనతో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ స్టాక్‌పై తమ ధర లక్ష్యాలను తగ్గించుకున్నారు.

ఇలా ట్విటర్ ను కొనుగోలు చేసి ఆ సంస్థనే కాదు.. తన వ్యాపారాలను కూడా ఎలన్ మస్క్ ముంచేసుకున్నాడని.. త్వరలోనే ఆయన సంపాద మొత్తం కరిగిపోవడం ఖాయమన్న అంచనాలు నెలకొంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News