రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో నష్టం భారీగానే ఉంటోంది. ఉక్రెయిన్ మొత్తం కకావికలం అయిపోయింది. దీంతో పలు నగరాలు దెబ్బతిన్నాయి. కోలుకోలేని విధంగా మారాయి. బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. రష్యా సేనల ధాటికి నివ్వెరపోతున్నాయి. యుద్ధ కాంక్షతో రష్యా చేస్తున్న దమనకాండతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలో రష్యా తీసుకొచ్చిన యుద్ధ నౌక దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నౌకలో భారీ ఆయుధ సామగ్రి ఉన్నట్లు చెబుతున్నారు
ఈ నేపథ్యంలో నౌకలో పేలుడు సంభవించినట్లు తెలిసింది. దీంతోనే నౌక ధ్వంసమైనట్లు సమాచారం. సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. అయితే నౌకపై తామే దాడి చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించడంతో రష్యా మాత్రం దాన్ని ఖండిస్తోంది. నౌకలో ఎలాంటి దాడులు జరగలేదని చెబుతోంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది దేశం విడిచి పారిపోయారు. రష్యా సేనలను ఉక్రెయిన్ కూడా ధీటుగానే ఎదుర్కొంటోంది. రష్యా తీసుకొచ్చిన యుద్ధ నౌకలను నాశనం చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ ముందుకు వెళ్తోంది. ఉక్రెయిన్ తీర ప్రాంతాలకు చేరుకున్న రష్యాకు చెందిన మాస్క్యా క్రూజ్ యుద్ధ నౌక చేరుకోగానే ఉక్రెయిన్ క్షిపణితో దాడికి పాల్పడినట్లు చెబుతోంది.
రష్యా దాడులకు ఉక్రెయిన్ కూడా గట్టిగానే సమాధానం చెబుతోంది. దాని వల్ల నష్టపోయినా ప్రతీకారం తీర్చుకునే క్రమంలో దాని శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయంగా వస్తున్న మద్దతును కూడగట్టుకుని తనదైన శైలిలో స్పందిస్తోంది. రష్యా ఇప్పటికే దాదాపు 20 వేల సైనికులతో పాటు భారీ స్థాయిలో యుద్ధ సామగ్రి, ఆయుధాలను నష్టపోవాల్సి వస్తోంది కానీ రష్యా మాత్రం వీటిని ఒప్పుకోవడం లేదు.
రష్యాతో యుద్ధం చేయడానికి తమకు మద్దతు తెలపాలని ఉక్రెయిన్ చేస్తున్న విన్నపాలను నాటో దేశాలతో పాటు పశ్చిమ దేశాలన్ని సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతోనే రష్యాపై తాను కూడా తెగబడి యుద్ధం చేస్తామని ఉక్రెయిన్ ప్రకటిస్తోంది. తమ దేశస్తులు 1350 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంటోంది.
రష్యా మాత్రం తన మనసు మార్చుకోవడం లేదు దీంతో ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంద. కానీ రష్యా తీరుతో ఉక్రెయిన్ నష్టపోయినా రష్యాకు సైతం అంతే స్థాయిలో నష్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయినా రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు. అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర జేసినా నిర్లక్ష్యంగానే ముందుకు వెళ్తోంది. ఉక్రెయిన్ ను మొత్తం ఆక్రమించే వరకు ఆగేది లేదని చెబుతోంది. ఈ క్రమంలో రష్యా దమనకాండ ఎప్పటికి ఆగేనా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.