కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి రాజకీయ ప్రవేశం అంత ఈజీగా జరగలేదు. రాజకీయలతో సంబంధం లేని రేణుక.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న నాదేండ్ల భాస్కర్ రావుపై పోరాడే రాజకీయాల్లోకి వచ్చారు.. అప్పటి వరకూ గృహిణీగా ఉన్న రేణుక కోపం తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చిన జనంతో కలిసి నాదెండ్లపై పోరాటానికి వెళ్లారు. అప్పటికే ఓ చిన్న పిల్ల, రెండో అమ్మాయి కడుపులో ఉన్నా కూడా ఎన్టీఆర్ కోసం ఉద్వేగంతో రోడ్డు మీదకు వచ్చిందట రేణుకా చౌదరి.. ఈ విషయాన్ని తాజాగా ఆమె పంచుకొని తన రాజకీయ ప్రస్థానాన్ని పేర్కొంది.
1984 ఆగస్టులో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి నాదెండ్ల సీఎం అయిన రోజులు.. దీన్ని తట్టుకోలేక తాను జనంతో కలిసి ఎన్టీఆర్ ను రామకృష్ణ స్డూడియోలో ఉన్నాడని తెలిసి కలవడానికి వెళ్లానని రేణుక తెలిసింది. పోలీసులు జనాన్ని చూసి లాఠీలతో కొడుతున్నారని.. అది చూసి తాను పూనకం వచ్చిన దానిలా పోలీసుల చేతిలో లాఠీ లాక్కొని పోలీసులపై అరిచానని రేణుక పేర్కొంది.
అనంతరం నాదెండ్ల భాస్కర్ రావుపై యుద్దానికి అక్కడి నుంచి బయలు దేరామని.. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నాదెండ్ల మాట్లాడుతుండగా.. నమ్మకద్రోహీ అంటూ గట్టిగా అరిచానని రేణుక తెలిపారు. అప్పుడే వెనుకాల నుంచి నాదెండ్లపై ఎవరో చెప్పు విసరగా తానే అనుకొని పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్ట్ చేశారని రేణుక వివరించారు. ఆ రోజు పేపర్ లో ‘ది యాంగ్రీ హౌస్ వైఫ్’ అంటూ నా ఫొటో వార్తలు వచ్చాయని.. అది ఎన్టీఆర్ సహా అందరికీ గుర్తిండిపోయిందన్నారు. అలా రాజకీయాల్లోకి వచ్చానని.. కార్పొరేటర్ గా మొదలైన ప్రస్థానం కేంద్రమంత్రి పదవుల దాకా సాగిందని రేణుక వివరించింది.