రావణుడు ఎవరు.. సీతను ఎత్తుకెళ్లిన రాక్షసుల రాజు అని భారతీయుల నమ్మకం. కానీ లంకలోని వారికి మాత్రం దేవుడు. వారి మహారాజు. సీతను ఎత్తుకెళ్లడం తప్పితే మిగతా అన్ని విషయాల్లో రావణుడు గొప్ప పరిపాలన దక్షుడని పురాణాలు చెబుతున్నాయి.
ఇప్పటికీ శ్రీలంక దేశస్థులు తమ రాజు అయిన రావణుడు సీతను అపహరించుకొని రాలేదని.. భారతీయులు చెబుతున్నది కట్టుకథ అని నమ్ముతుంటారు. అంతేకాదు.. దీన్ని తేల్చేపనిలో కూడా పడ్డారు. ప్రస్తుతం శ్రీలంకలో రావణాసురుడి గురించి విస్తృతంగా చర్చ సాగుతోంది. అక్కడి ప్రభుత్వం స్పేస్ మిషన్ లో భాగంగా పంపిన శాటిలైట్ కు ‘రావణ’ అనే పేరు పెట్టడం విశేషం. రావణుడు దయాగుణం కలవాడని.. మేధావి అని వాళ్లు నమ్ముతున్నారు.
తాజాగా శ్రీలంకేయులు ప్రపంచంలోనే మొదటి ఫైలెట్ గా రావణుడిని గుర్తించాలని పరిశోధన చేస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం ఈ మేరకు పరిశోధన చేయాలని చూస్తోంది. దాదాపు 5వేల ఏళ్ల క్రితమే రావణుడి లంకను దాటి సముద్రం మీదుగా భారత్ కు వచ్చాడని పురాణేతిహాసాల్లో ఉంది. దీన్ని బట్టి మొట్టమొదటి విమానాన్ని నడిపింది రావణుడేనని శ్రీలంక ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ విషయాన్ని తేల్చేందుకు లంక ప్రభుత్వం సిద్ధమైందట.. అప్పట్లో రావణుడు విమానం నడిపేందుకు వాడిన టెక్నిక్స్ పై అధ్యయనానికి సిద్ధమైందని శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ వైస్ చైర్మన్ శశిథనతుంగే చెబుతున్నాడు. ఇది కట్టుకథ అని అక్షర సత్యమని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై మరో ఐదేళ్లలో సమగ్ర అధ్యయనం చేసి ఐదేళ్లలో నిరూపిస్తామని చెబుతున్నారు. శ్రీలంకలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన భండారనాయకే లో పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. ఏవియేషన్ ఎక్స్ పర్ట్స్, చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు, జియాలిస్టులు ఈ భేటిలో పాల్గొన్నారు. 5వేల ఏళ్ల క్రితం రావణుడు శ్రీలంక నుంచి భారత్ కు విమానయానం చేశాడని వారంతా నిర్ణయానికి వచ్చారు. దీంతో రావణుడే తొలి పైలెట్ అని లంక నిర్ణారించబోతుందన్నమాట..