రాజకీయాల్లో వారు.. వీరు.. అనే తేడా ఏం ఉంటుంది? అధినేతను మచ్చిక చేసుకుంటే సరిపోతుంది. కావా ల్సినంత రాజకీయం చేసుకునేందుకు స్కోప్ ఉంటుంది. బహుశ ఇదే ఫార్ములాను ఫాలో అవుతు న్నట్టుగా ఉన్నారు.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే.. ముస్తాఫా. తనకు మంత్రి పదవి వస్తుందని.. ఎంతో ఆశ పెట్టుకు న్నారు. కానీ, రాలేదు. సీనియర్ నాయకుడు.. మైనారిటీ వర్గాల్లో మంచి నాయకుడిగా కూడా పేరు తెచ్చుకు న్నారు. అయినా.. కూడా పార్టీలోను.. ప్రభుత్వంలోనూ.. ఆశించిన విధంగా గుర్తింపు లేదు.
దీనికి కారణం.. గతంలో టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నించారనే గుసగుసే కావొచ్చని ఆయన అభిమానులు అంటారు. సరే..ఇదిలావుంటే..వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను.. తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీఅవుతుండగా.. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంపైనా.. ముస్తాఫా కన్నేశారనే ప్రచా రం జరుగుతోంది. ఇటీవల కాలంలో ముస్తాఫా.. కుమార్తె.. నూరీ ఫాతిమా రంగంలోకి దిగింది. తండ్రి వెంటే ఉంటూ.. నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నారు.
అంతేకాదు.. కొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఆమెను ఎమ్మెల్యేగా పే ర్కొంటూ ప్లెక్సీ ఒకటి వెలిసింది. ప్రస్తుతం ఇది గుంటూరులో కలకలం రేపుతోంది. నూరీ ఫాతిమాను ఓ హోటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ గుంటూరులో ప్లెక్సీలు వెలిసింది.
ఈ పెక్సీల్లో ఫాతిమాను గుం టూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పేర్కొన్నారు. అయితే.. ప్రింటింగ్ ప్రెస్ నిర్వహకుల తప్పిదం వల్లే ఇలా ప్లెక్సీలో తప్పులు దొర్లాయని ఎమ్మెల్యే అనుచరులు వ్యాఖ్యానించారు.
కానీ, ఇది..చాలా వ్యూహాత్మకంగా.. చేసిన ప్రయోగమని.. వైసీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ప్ర స్తుతం వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు లేరు. టీడీపీ నుంచి గెలిచి వచ్చిన గిరి ఉన్నారు. అయి తే.. ఆయన మళ్లీ టీడీపీలోకి వెళ్లిపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా నే ముస్తాఫా.. తన కుమార్తెను ఇక్కడ రంగంలోకి దింపాలని భావిస్తున్నారని.. దీనికిట్రయల్ నిర్వహించారని.. వైసీపీ కీలక నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.