పదేళ్లు దాటితే ఢిల్లీకి నో ఎంట్రీ

Update: 2015-04-08 12:23 GMT
పదేళ్ల డీజిల్‌ వాహనం పాతదా? అంటే.. నో అనే వాళ్లే ఎక్కువ. కానీ.. తాజాగా ఢిల్లీ మహానగరంలోకి మరికొద్ది గంటల తర్వాత 10ఏళ్ల వయసుకు మించిన డీజిల్‌ వాహనాల్ని అనుమతించరు.

ఇందుకు సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని తీసుకున్నారు. పెట్రోల్‌ వాహనాల వినియోగానికి సంబంధించి ఇప్పటికే పదిహేనేళ్ల పరిమితి ఉంది. 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్‌ వాహనాల్ని ఢిల్లీ మహానగరంలో వాడేందుకు అనుమతించారు. తాజాగా డీజిల్‌ వాహనాలకు ఈ పరిమితిని పదేళ్లకు కుదించారు.

నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో డీజిల్‌ వాహనాలపై సరికొత్త పరిమితిని దేశ రాజధానిని విధించనున్నారు. ఢిల్లీలోని ప్రతి ఎంట్రీ పాయింట్‌ వద్ద.. తనిఖీలు నిర్వహిస్తారు. డీజిల్‌ వాహనాలు కనుక పదేళ్ల కంటే ఎక్కువ పాతవైతే వాటిని నగరంలోకి అనుమతించరు. ఇక.. ఢిల్లీ నగరంలోని వాహనాలపై కూడా అధికారులు తనిఖీలు జరపనున్నారు. బండి కండీషన్‌ ఎలా ఉన్నా.. డీజిల్‌ వాహనం అయితే పదేళ్లకి.. పెట్రోల్‌ వాహనం అయితే పదిహేనేళ్లకు ఎలాంటి మొహమాటం లేకుండా మార్చేయాలన్న మాట.

Tags:    

Similar News