ఇద్దరు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల్లోని పార్టీలకు అధ్యక్షులే. ఇద్దరిలోను దూకుడు స్వభావం ఉంది. కానీ ఒకరేమో పార్టీలోని అందరినీ కలుపుకుని వెళుతుంటే మరొకరేమో కేవలం కొందరిని మాత్రమే కలుపుకుని వెళుతున్నారు. ఇంతకీ వీళ్ళద్దరు ఎవరో చెప్పలేదు కదా. అదేనండి కమలంపార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే మరొకరు ఏపి అధ్యక్షుడు సోము వీర్ర్రాజు. నిజానికి రెండు రాష్ట్రాల్లోను కమలం పార్టీకి చెప్పుకోదగ్గ బలమైతే లేదు. ఏదో గట్టిగా పార్టీ గాలి వీచినపుడు ఓ నాలుగు సీట్లలో గెలవటం లేకపోతే చతికలపడటమే అందరికీ తెలిసింది.
అలాంటిది మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో నాలుగు ఎంపి సీట్లు గెలిచింది. అలాగే మొన్నటి దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన దగ్గర నుండి పార్టీపేరు మారు మోగిపోతోంది. ఇటువంటి నేపధ్యంలోనే జరిగిన తాజా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీతో పాటు బండి పేరు కూడా అమాంతం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది. కారణం ఏమిటంటే బీజేపీ నేతల టీం వర్కే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ టీం వర్కు ఎలా సాధ్యమైందంటే కేవలం బండి నాయకత్వ వ్యూహాలతోనే సాధ్యమైందన్నది వాస్తవం. బండి వ్యూహాలు ఫలించిన కారణంగానే బీజేపీ బలం 4 డివిజన్ల నుండి 48 డివిజన్లకు పెరిగింది.
ఇదే సమయంలో ఏపి విషయానికి వస్తే సోము కూడా దూకుడు మీదుంటారు కానీ ఆయన దూకుడు ఎక్కువగా ప్రధానప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మీదే ఉంటుంది. తమకు ప్రధమ శతృవు చంద్రబాబే అని బాహాటంగానే సోము ప్రకటించిన విషయం తెలిసిందే. ముందు ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన తర్వాత అధికారంలోకి వస్తామంటు సోము గతంలోనే ప్రకటించారు. దానికి తగ్గట్టే వ్యూహాలను రచించుకుంటున్నారు.
అయితే తన వ్యూహాలు సక్సెస్ అవ్వాలంటే పార్టీలోని అందరు నేతలను కలుపుకుని వెళ్ళాలన్న విషయాన్ని మరచిపోయినట్లున్నారు. కేవలం తన వర్గం నేతలతోనే రెగ్యులర్ గా టచ్ లో ఉంటారన్న ఆరోపణలు సోముపై పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు సోము తన సామాజికవర్గంతోనే సమావేశాలు జరుపుతున్నట్లు ప్రచారంలో ఉంది. అలా కాకుండా వివిధ సామాజికవర్గాల్లోని తటస్తులతో కూడా కలవటం, వాళ్ళని పార్టీలోకి తీసుకోవటం లాంటి చర్యలతోనే పార్టీ బలోపేతమవుతుందన్న విషయాన్ని సోము మరచిపోయారు.