గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఊపును ఇచ్చింది విశాఖ సభే. నాటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ - తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు - జనసేన అధిపతి పవన్ కల్యాణ్ లు ఒకే వేదికను ఎక్కారు. జగన్ ను - కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని దుమ్మెత్తి పోశారు. తమకు అధికారం ఇస్తే అద్భుతాలు జరుగుతాయని నమ్మబలికారు. ప్రత్యేకహోదా - విభజనతో నష్టపోయిన సీమాంధ్ర - జగన్ అవినీతి.. అంటూ వారు ధారాళంగా స్పీచ్ లు వదిలారు.
అప్పటికే దేశంలో మోడీ గాలి ఊపందుకుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు కు పవన్ మద్దతు - అప్పటికే కాంగ్రెస్ పాలనపై ప్రబలిన వ్యతిరేకత..ఇవన్నీ ఊపందుకోవడం అప్పుడే మొదలైంది. తిరుపతిలో కూడా ఒకే వేదిక మీద ఈ నేతలు కనిపించారు. ఏదేమైనా విశాఖలో జరిగిన సభ మాత్రం ప్రత్యేకం!
దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు విశాఖలో తెలుగుదేశం సభ జరిగింది. అప్పుడు మోడీ - పవన్ ల ఎంట్రీతో కళకళలాడిన తెలుగుదేశం సభ ఈ సారి మాత్రం డొల్లగా సాగడం చర్చనీయాంశంగా మారింది.
విశాఖ సభలో అప్పుడు ఉత్సాహంతో ఊగిపోయిన జనం కనిపించగా.. ఈ సారి తెలుగుదేశం పార్టీ విశాఖ ఎన్నికల ప్రచార సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి! అప్పుడు ఊపు మీదున్న మోడీ హవా - విశాఖ ఏరియాలో పవన్ కు ఉన్న ప్రత్యేక ఓటు బ్యాంకు.. తెలుగుదేశం సభను అక్కడ సూపర్ సక్సెస్ చేశాయి. అయితే ఈ సారి అక్కడ చంద్రబాబు నాయుడు కొత్త వాళ్లను వెంట తీసుకెళ్లారు!
పశ్చిమబెంగాల్ సీఎం మమతా - ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు అక్కడ బాబుతో కనిపించారు. అయితే వీరి ఊపు ఏదీ సభలో కనిపించలేదు! అంతే కాదు.. ఈ సభలో బాబుకు మమత చేతిలో అవమానం ఎదురైందనే మాట కూడా వినిపిస్తూ ఉంది.
తమ బలం అంటూ.. మమత చేయి పట్టుకుని పైకి ఎత్తబోయారు చంద్రబాబు నాయుడు. అయితే దీదీ తన చేయిని లాగేసుకుంది. కేజ్రీవాల్ మాత్రం బాబుతో కలిసి చేతులెత్తేందుకు సిద్ధమైనా మమతా బెనర్జీ మాత్రం బాబుతో చేయి కలపలేదు. ఇక టీడీపీ నేతలు ఇచ్చిన కత్తిని కూడా అలా చూపి పక్కన పెట్టారు మమత.
దీదీతో కత్తి తిప్పించాలని ఉత్సాహ పడిన బాబు బోల్తా పడ్డారని అంతా అనుకుంటున్నారు. టీడీపీ నేతలు కత్తిని ఇస్తే.. ఎందుకన్నట్టుగా ఆశ్చర్యంగా చూసి పక్కన పెట్టారు మమత. మొత్తానికి అప్పుడు మోడీని తీసుకొచ్చి బాబు తనకు తాను ఊపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మాత్రం వీళ్లను పట్టుకుని వచ్చి - వారి చేతిలోనే అవమానాలను ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.