కర్ణాటకలో ఈ సాయంత్రం యడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. మరి అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో పార్టీల బలాబలాలను ఎలా లెక్కిస్తారు.. మూజువాణి ఓటింగ్ తోనా.? లేక డివిజన్ ఓటింగ్ తోనా.? ఈ విశ్వాస సమయంలో అసలు వాయిస్ ఓటింగ్ (మూజువాణి) ఓటింగ్ అంటే ఏమిటీ.. డివిజన్ ఓటింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం..
చట్టసభల్లో ఏదైనా అంశంపై ఆయా సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మూజువాణి ఓటు విధానాన్ని అనుసరిస్తారు. ఏదైనా అంశంపై మద్దతుగా ఉండే సభ్యులంతా తొలు ఎస్ అని అనాలి.. వ్యతిరేకించేవాళ్లంతా నో అని సమాధానం ఇవ్వాలి.. ఇలా ఏ అంశానికి సంబంధించి అయినా నోటి మాట ద్వారా అనుకూలమా.? వ్యతిరేకమా అని తెలిపేది అసెంబ్లీ సిబ్బంది లెక్కిస్తారు.. దీన్నే మూజువాణి ఓటింగ్ అంటారు. అయితే ఈ మూజువాణి ఓటింగ్ నిర్ణయించాలా వద్దా అన్నది స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
చట్టసభల్లో కీలకమైన అంశం కానీ బిల్లుపై చర్చ లేదా అవిశ్వాసం , విశ్వాస పరీక్షల సందర్భంగా ఏదైనా తీర్మానం చేసేందుకు ఖచ్చితత్వం కోసం డివిజన్ ఓటింగ్ ను స్పీకర్ కోరుతారు.. డివిజన్ ఓటింగ్ అంటే సభ్యులను లెక్కించడం.. ఏదైనా అంశంపై చర్చ విషయంలో అనుకూలంగా ఎంతమంది ఉన్నారు.. వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారనే విషయాలపై ఈ లెక్కింపు ద్వారా స్పష్టమైన ఫలితం వస్తుంది.. అనుకూలంగా, వ్యతిరేకంగా.. తటస్థంగా ఉన్నవారిని వేర్వేరుగా నిలబడి లెక్కిస్తారు.. దీని వల్ల ఖచ్చితమైన ఓటింగ్ జరుగుతుంది.. దీన్నే డివిజన్ ఓటింగ్ అంటారు.
కర్ణాటకలో ఈరోజు జరిగే యడ్యూరప్ప విశ్వాస పరీక్షను డివిజన్ పద్ధతిలో సభ్యులను నిలబెట్టి మద్దతు లెక్కించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. యడ్యూరప్పకు అనుకూలంగా ఎంతమంది ఓటు వేస్తారో అన్నది డివిజన్ ఓటింగ్ తో తేలుతుంది. దీనివల్ల ప్రభుత్వం నిలబడుతుందా లేదా అన్నది స్పష్టమవుతుంది.
*మూజువాణి ఓటింగ్ అంటే..
*డివిజన్ ఓటింగ్ అంటే..
కర్ణాటకలో ఈరోజు జరిగే యడ్యూరప్ప విశ్వాస పరీక్షను డివిజన్ పద్ధతిలో సభ్యులను నిలబెట్టి మద్దతు లెక్కించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. యడ్యూరప్పకు అనుకూలంగా ఎంతమంది ఓటు వేస్తారో అన్నది డివిజన్ ఓటింగ్ తో తేలుతుంది. దీనివల్ల ప్రభుత్వం నిలబడుతుందా లేదా అన్నది స్పష్టమవుతుంది.