పేస్ బుక్ కష్టాలు మళ్లీ మొదటికే .. ఏమైందంటే

Update: 2021-11-03 06:38 GMT
సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ పేరుని, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేరు మార్చారు. ఇకపై దీన్ని మెటాగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ మేరకు జుకర్ బర్గ్ తన కంపెనీ కొత్త పేరు, లోగోను ప్రకటించారు. దీని పూర్తి పేరు మెటావర్స్. సంక్షిప్తంగా మెటా అని నామకరణం చేశారు. ఫేస్ బుక్ యాప్ పేరు మారలేదు. యాప్ లో అదే పేరుతో అది కొనసాగనుంది. కాకపోతే మాతృసంస్థ పేరును మెటాగా మార్చారు. అంటే.. ఇకపై మెటా కింద ఫేస్ బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్ యాప్స్ ఉండనున్నాయి.

ఈమధ్య కాలంలో తరచుగా వివాదాలు ఎదుర్కొంటోంది ఫేస్ బుక్. ఆ గొడవలు వాట్సాప్ కు కూడా విస్తరించాయి. ప్రైవసీ పాలసీపై దుమారం రేగింది. దీంతో ఆసియా దేశాల్లో ఫేస్ బుక్ పై ఓ రకమైన వ్యతిరేక భావన వ్యక్తం అయింది. అదే టైమ్ లో ఇండియా లాంటి దేశాల్లో టెలిగ్రామ్ వాడకం కూడా పెరిగింది. వీటన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టాలంటే సంస్థ పేరు మార్చేయడమే ఉత్తమమని భావించాడు జుకర్ బర్గ్. ఇకపై కంపెనీ స్టాక్స్ అన్నీ కొత్త కంపెనీ మెటావర్స్ తోనే లిస్ట్ అవుతాయి.

తాజాగా, ఆ కొత్త లోగో మీద విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే, ఫేస్‌ బుక్‌ మాతృ సంస్థ "మెటా" కొత్త లోగో వేరే కంపెనీ లోగో లాగా కనిపిస్తుంది. గతంలో కంటే ఎక్కువ విమర్శలు రావడంతో పాటు కంపెనీకి నష్టాలు కూడా వస్తున్నాయి. ఈ కొత్త లోగోపై సదురు కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జర్మనికి చెందిన కంపెనీ 'ఎం-సెన్స్ Migräne' లోగో, ఫేస్‌ బుక్‌ మాతృ సంస్థ లోగో ఒకేవిధంగా ఉన్నాయి. సదురు కంపెనీ ట్విటర్ వేదికగా ఇలా రాశారు. మా మైగ్రేన్ యాప్ లోగో నుంచి ప్రేరణ పొందిన @facebook మాకు చాలా గౌరవం ఉంది. బహుశా వారు మా డేటా గోప్యతా పద్ధతుల నుంచి కూడా ప్రేరణ పొందుతున్నట్లు తెలుస్తుంది అని పేర్కొంది. అయితే, ఈ విషయంపై ట్విటర్లో భారీగా మిమ్స్ వర్షం కురుస్తుంది. లోగో కూడా కాపీ చేయాలా అంటూ ఫేస్‌ బుక్‌ ను ఏకి పారేస్తున్నారు. ‎


Tags:    

Similar News