మరి టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీ కన్నా కుటుంబ రాజకీయాల్లో ముదిరిపోయింది అనుకోవాలో లేక కాంగ్రెస్ వాళ్లు గురివింద మాటలు మాట్లాడుతున్నారని అనుకోవాలో కానీ... కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీ గా అభివర్ణిస్తున్నాడాయన. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పరిపాలన సాగుతోందని డిగ్గీ సాబ్ విమర్శించాడు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రులుగా కేసీఆర్ తనయుడు, అల్లుడు. ఎంపీగా కేసీఆర్ తనయ ఉంది కాబట్టి... తెలంగాణలో వారందరూ రాజకీయ ప్రముఖులుగా చెలామణి అవుతున్నారు కాబట్టి... దిగ్విజయ్ సింగ్ ఈ విమర్శలు చేసి ఉండవచ్చు,
అయితే కాంగ్రెస్ వాదిగా ఈ విమర్శలు చేస్తే వాటికి అంత విలువ ఉండకపోవచ్చు. ఎందుకంటే... కుటుంబ పాలనకు నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ. పేరుకు స్వతంత్రానికి పూర్వం ఏర్పడిన పార్టీనే కానీ... గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇందిరమ్మ కుటుంబం గుప్పిట్లోనే ఉంది. ఎంతో మంది జాతీయ నేతలు ప్రాతినిధ్యం వహించిన ఆ పార్టీకి ఇప్పుడు సోనియా కుటుంబం తప్ప మరో దిక్కు కూడా లేదు!
కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు ఏమిటో.. అవి ఏ స్థాయిలో ఉంటాయో దేశ ప్రజలు గత పదేళ్లలో చూశారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు దిగ్విజయ్ వచ్చి టీఆర్‌ఎస్ వాళ్లను విమర్శించడం విడ్డూరంగా ఉంది.
ఒకరకంగా చెప్పాలంటే టీఆర్‌ఎస్ కాంగ్రెస్ బాటలోనే నడుస్తోంది. కాంగ్రెస్ మాత్రం తన బాటలో నడుస్తున్న పార్టీని విమర్శిస్తోంది. కాబట్టి ఈ విమర్శల్లో నైతికత లేనట్లే!