దిగ్విజయ్ ను అరెస్ట్ చేస్తారా? లొంగిపోతారా?

Update: 2016-02-27 06:42 GMT
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కోర్టులో లొంగిపోవడానికి వెళ్తున్నారు. ఇంతకీ ఆయన లొంగిపోవడమేంటి? ఏమిటా కేసు అనుకుంటున్నారా.... ఇప్పటిది కాదు... ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కేసులో ఆయన విచారణకు సహకరించకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఆయన ఈ రోజు లొంగిపోకపోతే అరెస్టు చేయడానికి మధ్య ప్రదేశ్ పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మధ్యప్రదేశ్‌ శాసనసభ సచివాలయంలో సిబ్బంది నియామకాలకు సంబంధించిన కుంభకోణంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ కోర్టులో లొంగిపోనున్నారు. మధ్యప్రదేశ్‌ పోలీసులు తనను అరెస్టు చేయాలనుకుంటే చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. రాష్ట్ర హైకోర్టులో హాజరు కాకపోవడంతో స్థానిక కోర్టు దిగ్విజయ్‌ సింగ్‌ కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌ సింగ్‌ కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు కెకె కౌశల్‌ - ఎకె ప్యాసితో సహా ఏడుగురు వ్యక్తులు కోర్టుకు హాజరయ్యారు. 30 వేల రూపాయిల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో దిగ్విజయ్‌ సింగ్‌ కోర్టుకు హాజరు కాలేదు. తన హయాంలో నిబంధనల మేరకే నియామకాలు చేపట్టామని దిగ్విజయ్‌ సింగ్‌ చెబుతున్నారు. 1993-2003 మధ్య కాలంలో అసెంబ్లీ సెక్రటేరియట్‌లో నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దిగ్విజయ్‌ సింగ్‌ మరొక ఏడుగురిపై కేసు నమోదైంది.
Tags:    

Similar News