ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడెంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సాధారణంగా ఒక ప్రభుత్వం రెండు దఫాలుగా అధికారంలో ఉంటే.. సదరు సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావటం సహజంగా జరుగుతుంది. విపక్ష పార్టీకి సానుకూల వాతావరణం నెలకొంటుంది. కానీ.. కాంగ్రెస్ విషయంలో మాత్రం ఇది నిజం కావట్లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఈ వృద్ధ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న సంగతి తెలిసిందే.
ఒకప్పుడు దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేతిలోనే ఉండేవి. అలాంటిది ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఫలానా రాష్ట్రంలో కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందన్న ధీమానే కనిపించని దుస్థితి. తాను అధికారంలో ఉన్న పంజాబ్ లోనూ తిరిగి విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్న అంచనా వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన దిగ్విజయ్ సింగ్.. పార్టీ కార్యకర్తలకు తీవ్రమైన వార్నింగ్ ఇచ్చేశారు.
కార్యకర్తలు కలిసి పని చేయకుంటే 2023 ఎన్నికలే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు చివరి ఎన్నికలు అవుతాయని.. కార్యకర్తలంతా ఏకతాటిపై వచ్చి పని చేయాలన్నారు.
ఆయన మాట్లాడిన ప్రసంగపు వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారింది. కార్యకర్తలంతా ఏకతాటి పైకి రావాలని లేదంటే.. వచ్చే ఏడాది (2023) జరిగే అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలు అని తేల్చి చెప్పటం గమనార్హం.
కార్యకర్తలు ఎవరూ ముఖాముఖి మాట్లాడుకోవటం లేదని.. ఒకరు ఇక్కడుంటే మరొకరు అక్కడ ఉంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మూడో వ్యక్తి మరెక్కడో ఉంటారని.. పార్టీ పని చేసే విధానం ఇది కాదన్నారు. ''నిజాయితీగా పని చేయకుంటే ఇంట్లో కూర్చోండి. పోటీకి దూరంగా ఉండండి. ఇప్పుడు కాకుంటే మరెప్పటికి అధికారంలోకి రాదు. అప్పుడు కార్యకర్తలు అనేవారు కనిపించరు. కలిసికట్టుగా పని చేయకుంటే అవే చివరి ఎన్నికలు అవుతాయి'' అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ లో ఎన్నికలు వస్తుండటం తెలిసిందే.
దాదాపు పదిహేనేళ్ల తర్వాత 2018లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే.. పార్టీకి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరటంతో.. అధికారం చేతికి వచ్చిన పదిహేను నెలల వ్యవధిలోనే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది.
దీంతో.. 2023 చివర్లో జరిగే ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటోంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఆర్నెల్ల ముందు జరిగే ఈ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ కు నైతిక స్థైర్యాన్ని ఇవ్వటమే కాదు మనో బలాన్ని పెంచుతుందనటంలో సందేహం లేదు.