చెత్త‌యుద్ధంపై ఆర్మీ చీఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Update: 2017-05-29 05:04 GMT
ఎప్పుడూ ఎదురు కాని ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. సాధార‌ణంగా భార‌త్ లాంటి దేశంలో త్రివిధ ద‌ళాల అధిప‌తులు ఉన్న‌ప్ప‌టికీ.. తెర వెనుక మాత్ర‌మే వారి రోల్ ఉంటుంది త‌ప్పించి.. ఆన్ స్క్రీన్ మీద‌కు వ‌చ్చేసి త‌మ మ‌న‌సులోని మాట‌ల్ని చెప్పేశారు. గ‌డిచిన కొద్దిరోజులుగా క‌ల‌క‌లం రేపుతున్న కాశ్మీర్ ఆందోళ‌న‌కారుల అంశంపై ఆయ‌న తాజాగా పెద‌వి విప్పారు.

సైన్యంపైనా.. భ‌ద్ర‌తా ద‌ళాల మీద క‌శ్మీర్‌ లోని అల్ల‌రిమూక‌లు త‌ర‌చూ రాళ్ల‌దాడి చేయ‌టంపై రియాక్ట్ అయిన ఆయ‌న‌.. ఒక సంద‌ర్భంలో భావోద్వేగానికి గుర‌య్యారు. ఆందోళ‌న‌కారులు రాళ్లు విస‌ర‌టం మాని..కాల్పులు జ‌రిపితే సంతోషిస్తామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఆర్మీ అధికారి గొగోయ్ ఇటీవ‌ల‌.. అల్ల‌రి మూకులు విసురుతున్న రాళ్ల దాడి నుంచి త‌ప్పించేందుకు కాశ్మీరిని మాన‌వ క‌వ‌చంగా వాడుకుంటూ.. జీపున‌కు క‌ట్టేసిన వైనంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. కొంద‌రు మాత్రం ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించారు.

ఈ నేప‌థ్యంలో మాట్లాడిన రావ‌త్‌.. ఆందోళ‌న‌కారులు రాళ్ల‌ను ప‌క్క‌న పెట్టి కాల్పులు జ‌రిపితే త‌మ‌కు సంతోషంగా ఉంటుంద‌న్న ఆయ‌న‌.. ఆందోళ‌కారులు త‌మ‌పై రాళ్లు.. పెట్రోల్ బాంబులు విసురుతుంటే తాము జ‌స్ట్ వెయిట్ అండ్ డై అన్న‌ట్లుగా ఉండాల‌ని అధికారుల‌కు చెప్ప‌లేమ‌న్నారు. డ‌ర్టీవార్ ను ఎదుర్కొనేందుకు మాన‌వ క‌వ‌చం లాంటివి త‌ప్పేం కాద‌న్న ఆయ‌న‌.. ఇలాంటి త‌ప్ప‌ద‌ని తేల్చేయ‌టం గ‌మ‌నార్హం. రాళ్ల‌కు బ‌దులుగా బుల్లెట్ల‌ను వాడేయాల‌న్న ఆర్మీ చీఫ్ మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయ‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News