సరదా కోసం చేసే పనులు ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. అయితే అవి ప్రమాదకరం అని తెలిసినా కూడా చిల్ కోసం చాలామంది వాటిపై ఆసక్తి చూపుతారు. చివరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతారు. గుజరాత్ కు చెందిన దంపతులు అజిత్-సరళ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే అంతా రెడీ చేసుకున్నారు. మహారాష్ట్ర దయూలోని నంగవ్ బీచ్ కు వెళ్లారు. అక్కడ గాలిలో తేలియాడడం కోసం ఆ దంపతులు ముచ్చటపడ్డారు. అందుకు పారా సెయిలింగ్ చేయాలని భావించారు. అనుకున్నట్లుగానే అక్కడి సిబ్బందితో మాట్లాడారు. పారా సెయిలింగ్ ద్వారా సముద్రంపై గాలిలో ఎగరడానికి ధైర్యంగా సిద్ధపడ్డారు. నిర్వాహకులు వచ్చి పవర్ బోట్ సహాయంతో వారికి పారాచూట్ ద్వారా ఆకాశంలోకి వదిలారు. ఇక థ్రిల్ ఫీలయ్యే సమయంలో వారికి ఊహించని సంఘటన ఎదురైంది. అది కాస్త ఆ జంట హాలిడే ట్రిప్ మాత్రం కాస్త బ్యాడ్ మెమోరీని మిగిల్చింది.
సరదాగా పారా సెయిలింగ్ చేస్తూ ఎంజాయ్ చేద్దామని ఆ జంట భావించింది. అలా పారాచూట్ తగిలించుకొని గాలిలోకి చేరేలోపే వారికి ఊహించని షాక్ తగిలింది. అప్పటిదాకా కేరింతలు కొడుతూ ఉన్న ఆ దంపతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారు పైకి వెళ్లిన కొద్దిసేపటికే గాలిలో చక్కర్లు కొడుతున్న సమయంలో పారాచ్యూట్ కు అనుసంధానంగా ఉన్న తాడు తెగిపోయింది. పారాచ్యూట్ తో ఆ దంపతులు కొంతదూరం సముద్రంలోకి వెళ్లారు. ఆలోపే పవర్ బోట్ లో ఉన్న బాధితుడు అజిత్ సోదరుడు ఈ సంఘటనను గమనించారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వారు సముద్రంలో పడినా క్షేమంగా ఉండేలా ప్లాన్ చేశారు.
సిబ్బంది అప్రమత్తతో వారికి ప్రాణాపాయం తప్పింది. సముద్రంలో పడిపోయిన దంపతులను కాపాడడానికి వారు వెంటనే సముద్రంలో దిగారు. అయితే బాధితులు లైఫ్ జాకెట్లను ధరించారు అంతేకాకుండా అక్కడి సిబ్బంది వెంటనే అలెర్ట్ అయ్యారు కాబట్టి ఆ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దంపతులిద్దరూ క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు ఎలా వస్తాయో దీనిని చూస్తే అర్థమవుతుంది. హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేయాలనుకొని బీచ్ కి వెళ్లిన ఆ దంపతులకు ఇది ఒక బ్యాడ్ మెమోరీ అని చెప్పవచ్చు. బాధితుడి సోదరుడు చూడకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.