తెలంగాణ వినోద రంగంలోకి డిస్కవరీ ఎంట్

Update: 2023-05-18 10:50 GMT
తెలంగాణ వినోద రంగంలో ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ అడుగు పెట్టేందుకు ఓకే చెప్పింది. ఈ విషయంను మంత్రి కేటీఆర్‌ తో చర్చించి అధికారికంగా డిస్కవరీ సంస్థ ప్రతినిధులు ప్రకటించడం జరిగింది.

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ.. పరిశ్రమల శాక మంత్రి కేటీఆర్ అక్కడ పదుల కొద్దీ వ్యాపారవేత్తలను కలిశారు.

ఆ సందర్భంగా డిస్కవరీ ప్రతినిధులతో కూడా కేటీఆర్‌ భేటీ అయ్యాడు. తెలంగాణ లో వినోద రంగానికి ఉన్న ప్రాముఖ్యత మరియు వసతుల గురించి కేటీఆర్ వివరించారట..

కేటీఆర్‌ తో చర్చల తర్వాత తెలంగాణ వినోద రంగంలోకి ప్రవేశించేందుకు డిస్కవరీ సంస్థ ప్రతినిధులు ఓకే చెప్పారట. ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. డిస్కవరీ సంస్థ తెలంగాణ వినోద రంగంలోకి అడుగు పెట్టడం సంతోషకర విషయం.

క్రియేటివిటీ.. ఇన్నోవేషన్‌ హగ్ గా ఐడీసీ ని డిస్కవరీ ఏర్పాటు చేయబోతుంది. అందుకోసం మొదటి ఏడాది 1200 మందికి ఉపాధి లభించబోతుందని కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణ లో డిస్కవరీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పిన నేపథ్యంలో మరిన్ని సంస్థలు కూడా హైదరాబాద్‌ కి తరలి వచ్చేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా రంగంలో తెలుగు సినిమా దూసుకు పోతుంది. ఇప్పుడు డిస్కవరీ ఎంట్రీ ఇస్తే వినోద రంగంలో మరింత అభివృద్ధి సాధ్యం.

Similar News