అందరూ అనుకుంటున్నట్టుగానే ఒక్కరోజులో తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. మంత్రి ఈటల రాజేందర్ పై వేటుకు రంగం సిద్ధమైంది.ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నారు. ఆయన శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేసేశారు.
మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సిఫార్సు మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఇక నుంచి వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు.వైద్య ఆరోగ్యశాఖ ను ఈటల నుంచి తొలగించడంతో ఆయనను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.