వైసీపీ ఎమ్మెల్యేల్లో ఇంత‌మంది డౌటే.. ఇంట్ర‌స్టింగ్ స‌ర్వే...!

Update: 2021-10-01 16:25 GMT
ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్ పాల‌న గ‌మ‌నిస్తోన్న మేథావులు ముందు నుంచి ఒక్క‌టే మాట చెపుతూ వ‌స్తున్నారు. సీఎం జ‌గ‌న్ చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా డ‌మ్మీలు అయిపోయారు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు మిన‌హా ఎవ్వ‌రికి సొంత ఇమేజ్ అంటూ లేకుండా పోయింది. ఫ‌లానా ఎమ్మెల్యే, ఫ‌లానా మంత్రి సొంత ఇమేజ్‌తో గెలుస్తార‌ని ద‌మ్ముతో చెప్పే ప‌రిస్థితి ఒక‌రో ఇద్ద‌రికో మాత్ర‌మే ఉంది.

జ‌గ‌న్ పాల‌న కూడా అలాగే ఉన్న‌ట్టు అనిపిస్తోంది. రేప‌టి ఎన్నిక‌ల‌లో ఏపీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ కేవ‌లం త‌న‌ను చూసే ఓట్లేయాల‌ని.. మంత్రులు, ఎమ్మెల్యేల ప‌నితీరు కంటే కూడా వారికి జ‌గ‌నే క‌నిపించాల‌న్న‌దే ఆయ‌న తాపత్ర‌యంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వ పాల‌న స‌గం పూర్త‌య్యింది. రాబోయే రెండేళ్లు ప్ర‌భుత్వానికి ఎంతో కీల‌కం. ఈ స‌గం పాల‌న‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ప‌నితీరు ఎలా ? ఉంద‌నేదానిపై జ‌గ‌న్ సైతం ఒక‌టి రెండు స‌ర్వేలు అంత‌ర్గ‌తంగా చేయించుకున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఐఐటీ స్టూడెంట్స్‌తో ప‌లు స‌ర్వేలు చేయిస్తూ పాపుల‌ర్ అవుతోన్న ఆత్మ‌సాక్షి తాజాగా మ‌రో స‌ర్వే చేసింది. ఈ స‌ర్వేలో జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు సంతృప్తి ఉన్నా... ఎమ్మెల్యేల ప‌నితీరుపై మాత్రం అసంతృప్తి ఉంద‌న్న‌ది తేలిపోయింది. మొత్తం జ‌గ‌న్‌తో క‌లిపి 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే వీరిలో 66 మంది ఎమ్మెల్యేల‌కు ఏదో ఒక మ‌ర‌క ఉంది. వీరిలో 46 మంది వెరీ ఫూర్ అని స‌ర్వే తేట‌తెల్లం చేసింది. వీరిలో 20 మంది ఎమ్మెల్యేల‌కు క‌నీసం పాస్ మార్కులు అయిన 35 శాతం కూడా ద‌క్కించుకోలేక‌పోయారు.

ఈ స‌ర్వే ఈ యేడాది మార్చి - సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌లో జ‌రిగింది. ఇక 8 మంది ఎమ్మెల్యేలు మ‌రీ ఘోర‌మైన ప‌నితీరుతో ఉన్నార‌ట‌. మొత్తం 13 జిల్లాల‌లో క‌లిపి 68, 200 మందితో అభిప్రాయ సేక‌ర‌ణ జ‌రిగింది. ఇక మంత్రుల్లో 11 మంది క‌నీసం త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌ట్టు సాధించ‌లేక‌పోయార‌ట‌. వీరిలో అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, శంకర నారాయణ, గుమ్మనూరు జయరాం, తానేటి వనిత, శ్రీరంగనాథ రాజు, ధర్మాన కృష్ణదాస్, పినిపే విశ్వరూప్, అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఇక పై మంత్రుల్లో దాదాపు అంద‌రూ త‌మ ప‌ద‌వుల‌ను కోల్పేయేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌.

టీడీపీ ఎమ్మెల్యేలూ అంతే...
ఇక టీడీపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే చంద్ర‌బాబుతో సహా అంద‌రు ఎమ్మెల్యేలు ఓడిపోతార‌ని.. వారి పెర్పామెన్స్ 27 శాతం కంటే త‌క్కువుగా ఉంద‌ని ఆత్మ‌సాక్షి స‌ర్వే తేల్చిచెప్పింది. ఏదేమైనా వైసీపీ వాళ్లు జ‌గ‌న్ ఇమేజ్ మాత్ర‌మే న‌మ్మ‌కోకుండా ఈ రెండేళ్ల‌లో ఓన్ ఇమేజ్ పెంచుకుంటే నెక్ట్స్ బీ ఫామ్ తీసుకుంటారు. లేకపోతే వీరికి ఇవే చివ‌రి ఎన్నిక‌లు కావ‌చ్చు..!




Tags:    

Similar News