"శుద్ధ్ ఆహార్, మలీవత్ పర్ వార్"... లడ్డూ వివాదం వేళ రాజస్థాన్ కీలక నిర్ణయం!

ఈ సందర్భంగా తాజాగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు.

Update: 2024-09-21 11:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు కలిపారనే వ్యవహారం. తిరుమల లడ్డూలో వాడే నెయ్యి కల్తీదని, జంతువుల కొవ్వు అందులో కలిపారంటూ వస్తున్న రకరకాల ప్రచారాలు ఇప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోన్న పరిస్థితి.

ఈ సందర్భంగా తాజాగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా... తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ తనకూ ఉందని అన్నారు.

ఇదే సమయంలో శ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై టీటీడీ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్నతాధికారులు, ఆగమ సలహాదారులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రమైన కారణంగా.. ఆగమశాస్త్రపరంగా సూచనలివ్వాలని కోరారు.

ఈ సమయంలో... సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఒమహాశాంతి యాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అమ్రోవైపు... తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాజస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ సమర్పించే ప్రసాదం నాణ్యత, శుభ్రతను తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి 26 వరకూ చేపట్టాలని నిర్ణయించారు.

అవును.. తిరుమల లడ్డూపై వివాదం నేపథ్యంలో స్పందించిన రాజస్థాన్ సర్కార్... "శుద్ధ్ ఆహార్, మలీవత్ పర్ వార్" అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఈ ప్రకటన చేశారు!

Tags:    

Similar News