ఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం కేసు... ఇది మామూలు ట్విస్ట్ కాదు!
ఇదే సమయంలో... బాధిత మహిళ తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశామని అన్నారు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమొదైన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ శుక్రవారం స్వయంగా కోర్టుకి హాజరై.. ఎమ్మెల్యేపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్న అంశాలు అన్నీ అవాస్తవమ్ని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది.
అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... బాధిత మహిళ స్వయంగా హైకోర్టుకు హాజరై... ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు అన్నీ అవాస్తవమంటూ అఫిడవిట్ ను దాఖలు చేసింది.
ఈ సందర్భంగా... వాస్తవాలను వివరిస్తూనే అఫిడవిట్ వేశానని.. ఆదిమూలంపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసని.. దానిని కొట్టివేయాలని న్యాయమూర్తికి ఆమె వివరించారు. దీంతో... ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న నాయమూర్తి.. పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా... ఆదిమూలంపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు.
కాగా... తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన ఓ మహిళ... తనను బెదిరించి అత్యాచారం చేశారంటూ ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమయంలో... ఈ కేసును కొట్టివేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన విచారణలో ఆదిమూలం తరుపున వాదనలు వినిపించిన నాయవాది... ప్రాథమిక విచారణ చేయకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని.. మూడో వ్యక్తి ఒత్తిడితోనే పిటిషనర్ పై మహిళ ఫిర్యాదు చేశారని.. ఇది హనీట్రాప్ అని పేర్కొన్నారు. అందువల్ల... దీనిపై అత్యాచారం సెక్షన్ నమోదు చెల్లదని తెలిపారు.
ఇదే సమయంలో... బాధిత మహిళ తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశామని అన్నారు. దానిని పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యేపై కేసును కొట్టేయాలని కోరారు. ఈ నేపథ్యంలో... ఈ విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.