మరో రోజులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సంప్రదాయానికి విరుద్ధంగా తొలిరోజు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయని ఇప్పటికే కేసీఆర్ సర్కారు స్పష్టం చేసింది.
ప్రభుత్వ ప్రకటన మీద వెంటనే స్పందించని గవర్నర్ తమిళ సై.. తాజాగా ప్రభుత్వ తీరును తప్పు పట్టటమే కాదు.. గవర్నర్ ప్రసంగం రాజ్ భవన్ తయారు చేయదని.. ప్రభుత్వమే తయారు చేసి ఇస్తుందని.. ప్రగతి నివేదికను చదవటం ద్వారా.. దానిపై చర్చ జరుగుతుందని.. తాజా పరిణామంతో సభలోని సభ్యులు దానిపై చర్చించే అవకాశాన్ని మిస్ అవుతారని స్పష్టం చేస్తున్నారు.
అసలీ పరిస్థితికి కారణం ఏమిటి? ఎవరి కారణంగా గవర్నర్ - ముఖ్యమంత్రి మధ్య దూరం పెరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి అందరి నోట వినిపిస్తున్న మాట.. హుజూరాబాద్ ఉప ఎన్నికగా చెబుతున్నారు. అదెలానంటే.. ఈ ఉప ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి జాయిన్ చేసుకోవటం.. అతడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వటం తెలిసిందే.
గవర్నర్ కోటాలో అతడ్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తే.. కౌశిక్ రెడ్డి మీద ఉన్న కేసులు ఉన్నాయని పేర్కొంటూ గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ తో మాట్లాడి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. రెండు..మూడు సార్లు కేసీఆర్ ప్రయత్నాలు చేయటం.. అందుకు గవర్నర్ ససేమిరా అనటంపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నట్లు చెబుతారు.
దీంతో.. కౌశిక్ రెడ్డికి బదులుగా.. గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి అవకాశాన్ని కల్పించారు. అదే సమయంలో.. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యేల కోటా నుంచి ఎంపిక చేస్తామని సర్దుబాటు చేశారు.
ఇదిలా ఉంటే..మండలి ప్రోటెం ఛైర్మన్ విషయంలోనూ రాజ్ భవన్ స్పందించిన తీరుపైనా సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రొటెం ఛైర్మన్ గా మజ్లిస్ కు చెందిన అమీనుల్ జాఫ్రీ పేరును ప్రభుత్వం సిఫార్సు చేస్తే.. అందుకు స్పందించిన రాజ్ భవన్.. అసలు ప్రొటెం ఛైర్మన్ అవసరం ఏమిటని ప్రశ్నించటమే కాదు.. న్యాయ సలహాను కోరటాన్ని సీఎం కేసీఆర్ తప్పు పడుతున్నట్లుగా చెబుతున్నారు.
తాము పంపిన ప్రతి నిర్ణయంపైనా ఏవో ఒక కొర్రీలు పెడుతున్నట్లుగా భావిస్తున్న ప్రగతిభవన్.. ఈసారి రాజ్ భవన్ కు చురుకు తగిలేలా చర్యలు తీసుకోవాలని భావించి.. అందుకు తగ్గట్లే.. తాజా బడ్జెట్ సెషల్ లో ఉండాల్సిన గవర్నర్ ప్రసంగాన్ని తీసేయటం ద్వారా.. దూరాన్ని మరింత పెంచేలా పావులు కదుపుతున్నారని చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి.
ఈ మధ్యన జనవరి 26న జరిగిన కార్యక్రమానికి సీఎం హాజరు కాకపోవటం.. ఆమె ప్రసంగంలోనూ మార్పులు రావటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. మరి.. ఈ వార్ లో ఎవరిది పైచేయి అవుతుందన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.