ప్రేమకు, కామానికి మధ్యన తేడాను ఇలా గుర్తించండి

Update: 2022-05-31 03:30 GMT
తొలి ప్రేమ ఎవరికైనా ఒక మధురానుభూతి. టీనేజ్ లో పుట్టే ఆ ప్రేమ కర్ర కాలేవరకూ మదిలో భద్రంగా ఉంటుంది. ఆ మధురస్మృతులు ఎప్పటికీ పోవు. ప్రేమలో పడితే ఈ ప్రపంచంలో నువ్వు విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమను వ్యక్తీకరించడానికి ఎన్నో మార్గాలున్నాయి. మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీ మనసులో ఏం జరుగుతుంది? మీరు ప్రేమలో ఉన్నారా? లేక కోరికల ప్రభావమా? లేక కామంతో ఇలా ప్రవర్తిస్తున్నారా? ప్రేమకు, కామానికి తేడా ఏంటి? ఎలా గుర్తించాలన్నదానిపై స్పెషల్ ఫోకస్.

తాజాగా రాట్ కర్స్ యూనివర్సిటీకి చెందిన హెలెన్ ఇ. ఫిషర్ తాజాగా ప్రేమకు, కామానికి మధ్యనున్న తేడాను వివరించారు. తరచూ కామం ముందు వరుసలో నిలుస్తుందని.. అయితే అది అన్ని సందర్భాల్లో నిజం కాదని తెలిపారు. శృంగారం మీద ఆసక్తి లేనివారిలో కలిగే ప్రేమ భావనలో కామం ఉండకపోవచ్చన్నారు.

కామం అనేది ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు చూపించే ప్రభావం అని తెలిపారు. ఇవి మీ లైంగిక సామర్థ్యాన్ని, కోరికను ప్రభావితం చేస్తాయని వివరించారు. ఇది పూర్తిగా భౌతికమైన అంశమని.. ఇది సెక్స్ చేయాలనే కోరికను కలిగిస్తూ ఉంటుందని తెలిపారు. కామం లేకపోతే భూమిపై మానవజాతి ఉనికే ఉండేది కాదని చెబుతున్నారు.

ఇక ప్రేమకు డోపమీన్ అనే న్యూరోట్రాన్స్ మిటర్ ద్వారా ప్రభావితమవుతుంది. ఇది మన మెదడులో విడుదలయ్యే జీవ రసాయనం. ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలని మనల్ని ప్రేరేపిస్తుంది. అదే పనిని పదేపదే చేయాల్సిందిగా కూడా చెబుతుంటుంది.

ఆపారమైన ఆకర్షణ అనే భావన మనిషిని ప్రేమ పట్ల వ్యసనపరుడిగా మారుస్తుంది. కొంతమంది వ్యక్తులు ఈ వలయంలో కూరుకుపోతారు.డోపమీన్ ప్రేరణల వల్ల కొత్త సంబంధాలుఅనే థ్రిల్ కోసం వెతుకుతుంటారు. అంటేవీరు ప్రేమ బానిసలు అని అర్థం.

కామంలో రెండు హార్మోన్లు పనిచేస్తాయి. ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, . ఆక్సిటోసిన్ శృంగారం సమయంలో విడుదలై లైంగిక సంపర్కాన్ని ప్రేరేపిస్తుంది. శృంగారం ముగిశాక వాసోప్రెసిన్ అనే హార్మోన్ విడుదలై సంతృప్తిని కలిగిస్తుంది. అయితే ఇది సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులను బాధితులుగా మారుస్తుంది. దీంతో వాళ్లు మళ్లీ మళ్లీ కావాలని.. పొందాలనీ కోరుకుంటుంది.

మీలో ప్రేమ భావన కలిగించేంది డోపమీన్ హార్మన్. అది ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుంది. మీలో ప్రేమ భావన లేదంటే మీ మెదడు మీ మనసుపై ఆధిపత్యం చెలాయిస్తోందని అర్థం.
Tags:    

Similar News