రేషన్ పంపిణీ నిలిపివేసిన తెలంగాణ సర్కార్ .. కారణం ఇదే !

Update: 2020-03-27 08:42 GMT
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు  700 దాటిపోవడంతో దేశ ప్రజలందరూ భయంతో . ఇక ప్రభుత్వాలు కూడా షట్ డౌన్ రాష్ట్రాలను షట్ డౌన్ చేసి ప్రజలకు కావలసిన మౌలిక అవసరాలను తీర్చే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో నిరుపేదలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యం లో తెలంగాణా ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తామని, అలాగే 1500 రూపాయలు నగదు ఇస్తామని ప్రకటించింది.

కానీ తాజాగా రేషన్ పంపిణీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.అయితే రేషన్ బియ్యం సరఫరా ఇవ్వటం ప్రారంభించిన నేపథ్యంలో ఒక్కసారిగా రేషన్ కోసం ప్రజలు గుమి కూడుతున్న నేపధ్యంలో రేషన్ సరఫరాని నిలిపి వేశారు. నిన్నటి నుండి హైదరాబాద్ మినహా , రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో  లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ మొదలవగా, ప్రజల తాకిడి తట్టుకోలేక , ప్రత్యామ్నాయం ఆలోచించాలని భావించిన సర్కార్  రేషన్ ని  నిలిపివేసింది.

ఉచిత బియ్యం కావడంతో కొన్ని చోట్ల బియ్యం కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. 20 మందికి మించి రావద్దని విన్నవించినా వందల సంఖ్యలో ఎగబడటం తో, కరోనా  వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉండటంతో రేషన్ ఇవ్వడాన్ని మధ్యలోనే  ఆపివేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో బియ్యం పంపిణీ నిలిపివేసిన డీలర్లు రేషన్ పంపిణీ నిలిపివేతకు సరైన కారణాలు ప్రజలకి తెలపకపోవడంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో ప్రతి ఒక్కరికి టోకెన్ జారీ చేసి , టోకెన్ ప్రకారం రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చూస్తుంది. మరో పక్క ఈ-పాస్, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి కీ రిజిష్టర్ ఆధారంగా పంపిణీకి అవకాశం ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం సైతం విన్నవించింది. ఇక ఇదే ఇప్పుడున్న పరిస్థితిలో అనివార్యం అని పేర్కొన్నారు . అలా అయితేనే కరోనా కట్టడికి సాధ్యమవుతుందని కూడా వారు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నేడు బియ్యం పంపిణీకి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది .
Tags:    

Similar News