అత్యధిక జనాభా అనగానే మనకు గుర్తుకువచ్చేది చైనా. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆ దేశం... అప్పట్లో జనాభాలో కూడా రికార్డు సాధించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఎక్కువ పిల్లల్ని కనకూడదని నిబంధనలు విధించారు.
ఒక్క సంతానం మాత్రమే ఉండాలని ఆదేశించారు. ఇక పిల్లలంటే మహా ఇష్టం ఉన్న దంపతులు సైతం దీన్ని కఠినంగా పాటించాల్సి వచ్చింది. అయితే ఆ రూపకర్తల విధానాలే ఇప్పుడు చైనాను సంక్షోభంలో పడేశాయి. ఎక్కడా లేని విధంగా జనాభా సంక్షోభం ఏర్పడింది. కరోనా వల్ల ఆ సమస్య మరింత ముదిరింది. దాంతో జనాల్ని పిల్లల్ని కనేందుకు ప్రోత్సహించాలని ఆ దేశ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.
తొలుత ఒక్క సంతానానికి మాత్రమే అనుమతి ఉన్న డ్రాగన్ దేశంలో... 2016 లో కాస్త మార్పు వచ్చింది. 2016 సెప్టెంబర్ లో నూతన చట్టం తీసుకొచ్చి... ఇద్దరు పిల్లల్ని కనడానికి అనుమతి ఇచ్చింది. అప్పుడు జరిగిన జనగణన ఫలితాల వల్లే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ తాజాగా జరిపిన జనగణనలోనూ చైనాకు మళ్లీ నిరాశే ఎదురైంది.
జనాభా విషయంలో ప్రమాద ఘంటికలు కనిపించాయి. ఎన్నడూ లేని విధంగా జననాల రేటు తగ్గింది. అత్యధిక జనాభా ఉండే హనాస్ లోనూ తక్కువ జనానాలు నమోదయ్యాయి. 1978 తర్వాత ఇదే తొలిసారి. 2020లో జననాల రేటు 8.52గా నమోదైంది. 43 ఏళ్ల తర్వాత ఇది అత్యల్పం. ప్రతివెయ్యి మందికి 1.45 జననరేటుగా ఉంది. 1978 తర్వాత అతి తక్కువగా ఉన్నది ఇదేనని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.
పిల్లల సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు ఆ దేశ ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. గతేడాదిలో ముగ్గురు పిల్లల్ని కనడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఉద్యోగులకు వివిధ రకాల సెలవులను ప్రకటించింది. వివాహం, ప్రసూతి, పేరెంటింగ్ హాలి డేస్ ను ఇచ్చింది. అయినా కూడా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. అత్యధిక జనాభా ఉండే ప్రాంతాల్లోనూ తక్కువ జననాలు నమోదు కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఎలాగైనా జనాభాను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కరోనా కారణంగా ఈ జనాభా రేటు విపరీతంగా తగ్గిపోయింది. చాలామంది పిల్లల్ని కనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇన్నాళ్లు ఒక సంతానంతో సాగిన సంప్రదాయం... ఇప్పుడు ముగ్గుర్ని కనమంటే అక్కడి ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరైతే ఏకంగా పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు.
అయితే చైనాలో వృద్ధులు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. ఇక ఈ పిల్లల సంక్షోభం నుంచి బయటపడడానికి నూతన విధానాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కాగా ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లల కోసం చైనా పడుతున్న తాపత్రయం పట్ల నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.