40 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించిన దివ్యారెడ్డి

Update: 2019-12-07 12:59 GMT
40 ఏళ్ల వయసులో భారతీయ అథ్లెట్  బొల్లారెడ్డి దివ్యారెడ్డి అద్భుతం సాధించారు. మలేషియాలో జరుగుతున్న ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో 40 ఏళ్ల మహిళల వయో విభాగంలో సత్తా చాటారు. 1500మీటర్ల పరుగులో భారత్ కు ఏకంగా స్వర్ణ పతకం సాధించిపెట్టారు.

తెలంగాణకు చెందిన బొల్లారెడ్డి దివ్యారెడ్డి మలేషియాలో జరుగుతున్న అథ్లెటిక్స్  పోటీలో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. తాజాగా మలేసియాలోని సారావక్ లో జరుగుతున్న ఈ చాంపియన్ షిప్ లో దివ్యారెడ్డి రెండు పతకాలు సాధించి ఔరా అనిపించారు.

మలేషియాలోని సారావక్ చాంపియన్ షిప్ లో  40 ఏళ్ల విభాగంలో దివ్యారెడ్డి పోటీపడ్డారు. 800 మీటర్ల కేటగిరిలో విజేతగా నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకున్నారు. 2.53.64 సెకన్లలోనే గమ్యానికి చేరుకొని చాంపియన్ గా నిలిచారు. ఇక 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నారు.

మలేషియా సారావక్ చాంపియన్ షిప్ లో దివ్యారెడ్డి స్వర్ణం గెలుచుకోగా.. మలేషియాకు చెందిన గోతెంగ్ యిన్ రజతం.. భారత్ కే చెందిన అమితా కనెగాంకర్   కాంస్య పతకం సాధించారు.
    


Tags:    

Similar News