దేశవ్యాప్తంగా దీపావళి పండుగను బ్రహ్మాండంగా జరుపుకొన్నారు. పల్లెలు - పట్టణాలు అన్న తేడా లేకుండా జనమంతా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. అయితే.. దీపావళి అంటే కాలుష్యం - ఖర్చూ కూడా ఎక్కువే. నిన్నటి దీపావళి సందర్భంగా ఒక్క రోజులోనే భారత దేశం రూ.3500 మందుగుండు కోసం ఖర్చు చేసిందని అంచనా.
భారతదేశ జనాభా 121 కోట్లు.. పాతిక కోట్ల కుటుంబాలున్నాయి. అందులో హిందూ కుటుంబాలు 80.5 శాతం. దీపావళి రోజున సుమారు 20 కోట్ల కుటుంబాలు పండుగ చేసుకుంటాయి. కానీ... అందులో 3.5 కోట్ల కుటుంబాలు మాత్రమే బాణసంచా కాలుస్తాయట. సగటున ఒక్కో కుటుంబం 1000 రూపాయలు ఖర్చు చేసిందనుకుంటే మొత్తం రూ.3500 కోట్లు ఖర్చయినట్లు.
ప్రపంచంలో ఆకలితో ఆలమటిస్తున్నవారిలో 15.2 శాతం మంది ఇండియాలోనే ఉన్నారు. ఏటా 25 లక్షల మంది ఆకలితో మరణిస్తారు. రోజుకు 20 కోట్ల మంది తిండి లేకుండానే ఖాళీ కడుపుతో పడుకుంటారు. అలాంటి దేశంలో కేవలం సరదా కోసం ఇంత మొత్తం ఖర్చు అవసరమా అన్న వాదన ఉంది. అదేసమయంలో ఇలా బాణసంచా కోసం ఖర్చు చేసినవారెవరూ పేదలకు నేరుగా సహాయం చేయడం తక్కువే అని... బాణసంచా కారణంగా పరోక్షంగా లక్షల మందికి పని దొరికి పేదరికం తగ్గుతోందని అనేవారూ ఉన్నారు. మొత్తానికి డబ్బు వృథా నిజమే అయినా లక్షల మంది పని దొరుకుతుందన్నది మాత్రం వాస్తవం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/