తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకపోవడం అనే అంశం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇబ్బందిగా మారుతోంది. తాజాగా ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కె.కవిత మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాజకీయనాయకులకు అస్త్రంగా మారి కేసీఆర్‌ను ఇరుకున పెడుతుంటే.....మరోవైపు తాజాగా నమోదైన ఓ కేసు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ నేత, గద్వాల ఎమ్మల్యే డీకే అరుణ సుప్రింకోర్టు లో తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆరుగురు మహిళలు మంత్రులుగా ఉన్నారని, ప్రతస్తుతం ఎవరూ లేరని ఆమె వివరించారు. ప్రతి విషయంలో సగభాగంగా ఉండే మహిళలకు మంత్రివర్గంలో అసలు చోటు కల్పించకపోవడం దారుణమని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని ఆమె అబిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాని సుప్రింకోర్టు డైరెక్షన్ ఇవ్వాలని ఆమె కోరారు.
కేవలం కేసు వేయడమే కాకుండా కేసీఆర్ మరో ఉచిత సలహా కూడా ఇచ్చారు అరుణ. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో సమర్ధులు లేరని భావిస్తే శ్రీనివాస యాదవ్ ను, తుమ్మల నాగేశ్వరరావును తీసుకున్నట్లుగా ఇతరులను ఎందుకు తీసుకోవచ్చని చెప్పారు. శాసనసభలో సమర్థులు అయిన మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారని వ్యాఖ్యానించారు.