రెండు రోజులు.. రెండు సభలు. అంతే.. ఇప్పటివరకూ మాజీ మంత్రి డీకే అరుణకున్న ఇమేజ్ మొత్తంగా మారిపోయింది. కేసీఆర్ లాంటి మాటల మరాఠికి ఎదురొడ్డి సమాధానం చెప్పే దమ్ము.. ధైర్యం ఉన్న మగాడు ఎవరైనా ఉన్నారా తెలుగు నేలలో అన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పేవారు కాదు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. కేసీఆర్ ఏంటి? అంతకు మించినట్లుగా డీకే అరుణ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారటమే కాదు.. ఆమె మాటల వీడియోక్లిప్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
నా కొడకల్లారా.. తాట తీస్తానంటూ మొన్న విరుచుకుపడిన డీకే అరుణ మాటలకు.. కేసీఆర్ అంతటోడు సైతం రియాక్ట్ కావాల్సి వచ్చింది. మహిళ అన్నది కూడా చూడకుండా డీకే అరుణ.. నీ సంగతి చెబుతా? అంటూ వార్నింగ్ ఇచ్చేసిన కసీఆర్ తీరును చూసినప్పుడు కాసింత ఆశ్చర్యానికి గురైనోళ్లు ఎందరో.
అంత పెద్ద కేసీఆర్ సైతం డీకే అరుణ మాటలకు రియాక్ట్ కావాలా? అన్న క్వశ్చన్ చాలా మందికి వచ్చింది. తనపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి డీకే అరుణ రియాక్ట్ అయ్యారు. నాకొడకల్లారా అన్న స్థానే.. ఈసారి ఒక అడుగు ముందుకేసి.. ఈ నా టీఆర్ఎస్ కొడులంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ తనను విమర్శించిన విమర్శలతో పాటు.. ఆరోపణల మీదా స్పందించిన ఆమె.. వీడియో చూపిస్తావా? ఫోటోలు చూపిస్తావా? సరే.. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న నువ్వు ఏం పీకావ్. అంటూ సూటిగా క్వశ్చన్ వేసేశారు. అంతేనా.. ఇష్టం వచ్చినట్లుగా కూస్తే ఊరుకోవటానికి తాను కేసీఆర్ మాదిరి బ్రోకర్ కుటుంబం నుంచి రాలేదని.. త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చానని.. చెప్పారు. గద్వాలలోని ప్రతి ఇంట్లో తన ఫోటో ఉంటుందన్న ఆమె.. కేసీఆర్ మాయల ఫకీరు వేషాలు వేయొద్దని.. ఆయన బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదన్నారు.
తెలంగాణలో పుట్టి నీచమైన మాటలు మాట్లాడుతున్నావు.. ఇదేనా తెలంగాణ సంస్కృతి? అని ప్రశ్నించిన ఆమె.. నువ్వు తిడితే శ్లోకాలు.. మావి తిట్లా అని విరుచుకుపడ్డారు.
సీఎం అయ్యి ఉండి ఎలా మాట్లాడాలో కనీసం సోయి ఉండాలని.. ఉద్యమ సమయంలో కేసీఆర్ ది దొంగ దీక్ష అని.. అది బయటపెడితే ఎక్కడ ఉద్యమం నీరు కారిపోతుందోనన్న ఉద్దేశంతో భరించామన్నారు. విద్యార్థుల ప్రాణాలు తీసిన కుటుంబం మీది.. ఈ నా టీఆర్ఎస్ కొడుకులది అంటూ ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తన ఒళ్లు తన దగ్గరే ఉందని.. కేసీఆర్ ఒళ్లే ఎక్కడో ఉందని.. ఆయనే ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ హెచ్చరించారు.
కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే మతిస్థిమితం కోల్పోయి సంస్కార హీనంగా.. పిచ్చోడిలా మాట్లాడుతున్నారని మండిపడిన డీకే.. పాలమూరులో ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చానని చెప్పటానికి సిగ్గు ఉందా? అని ప్రశ్నించారు.
దమ్ముంటే జోగులాంబ వద్దకు వచ్చి నిరూపించు. అబద్దాలు చెబితే జోగులాంబ క్షమించదు.. శాపంతో మాడి మసైపోతావు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ నువ్వు చాలా పెద్ద జూటాకోర్ వి. ప్రాజెక్టుల పనులపేరుతో మీ నేతలంతా గెస్ట్ హౌస్ లో ఎంజాయ్ చేశారే తప్పించి నీళ్ల కోసం ఏం చేయలేదని మండిపడ్డారు.తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? పెళ్లాం పిల్లలు లేరా? ఖబడ్డార్ కేసీఆర్ అంటూ ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు.గడిచినరెండు దఫాలుగా డీకేఅరుణ చేసిన వ్యాఖ్యల ముందు కేసీఆర్ మాటలు చిన్నపోవటం గమనార్హం.