ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే అంధ్రప్రదేశ్.. ఈయన ముందు ఎవరూ లేరు.. తరువాత ఎవరూ ఉండరు.. చంద్రబాబు ఫ్యామిలీ తప్పితే ఇక మరో పేరు ఉండడానికి వీల్లేదు. అందుకే చంద్రబాబు బతికుండగానే తన పేరుతో పథకాలను ప్రకటించేసుకున్నారు. ఇక తెలుగు దేశం వ్యవస్థాపకులు - తనకు పిల్లనిచ్చిన మామ పేరుతో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఇక వీరి ఫ్యామిలీ తప్ప ఆంధ్రప్రదేశ్ ను ఉద్దరించిన వారే లేరని చంద్రబాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే అయితే చంద్రబాబు - లేదంటే ఎన్టీఆర్.. ఈ ఇద్దరి పేరు మీదే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 30 పథకాలు కొనసాగుతున్నాయి. ఈ మాట మేమంటున్నది కాదు.. సోషల్ మీడియా యాక్టివిస్టులు సందీప్ పాండే - రామకృష్ణ రాజులు తాజాగా వెలుబుచ్చిన అభిప్రాయాలివీ..
దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మందికి లబ్ధి చేకూర్చే కేంద్ర పథకాలకు కూడా ప్రధాని నరేంద్రమోడీ తన పేరును పెట్టుకోలేదు. కేవలం ‘ప్రధానమంత్రి యోజన’ పేరుతో పలు పథకాలను ప్రవేశపెట్టారు. కానీ మన చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ - అన్న - చంద్రన్న పేరుతో ఏకంగా ఏపీలో 30 పథకాలు పెట్టడం విశేషం..
ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజలదే.. అలాంటప్పుడు ఈ ప్రజల్లో ప్రతిపక్ష నాయకులున్నారు.. చంద్రబాబు అంటే పడని వారున్నారు.. టీడీపీ వ్యతిరేకులు కూడా ఉన్నారు. కానీ వారి మనోభావాలు ఏవీ ఆలోచించకుండా మొత్తం టీడీపీ ఫ్యామిలీ పేర్లు పెట్టడం ఏంటని పలువురు సోషల్ మీడియా యాక్టిస్టులు ప్రశ్నిస్తున్నారు.. ఈ పథకాల పేర్లను మార్చాలని కోరుతున్నారు..
*చంద్రబాబు పేరుపై ఉన్న పథకాలు
చంద్రన్న బాట - చంద్రన్న బీమా - చంద్రబాబు విదేశీ విద్యా దానం
*ఎన్టీఆర్ పేరున ఉన్న పథకాలు
ఎన్టీఆర్ పించన్ పథకం - ఎన్టీఆర్ సుజల స్రవంతి - ఎన్టీఆర్ జలసిరి - ఎన్టీఆర్ విద్యోన్నతి - ఎన్టీఆర్ విద్యా సేవ - ఎన్టీఆర్ విద్య పరీక్ష - ఎన్టీఆర్ సాయం - ఎన్టీఆర్ విదేశీ విద్యాదానం - ఎన్టీఆర్ గృహ నిర్మాణం మొదలైనవి..
*అన్న పేరుతో ఉన్న పథకాలు
అన్న అమృతం - అన్న క్యాంటీన్ - అన్న సంజీవని - అన్న అభయ హస్తం - అన్న దీవెన మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ ’అన్న’ అంటే ఎన్టీఆర్.. ఆయనను తెలుగు ప్రజల అలా ముద్దుగా పిలుస్తారు..
ఇక చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ‘కేసీఆర్ కిట్ ’ పేరుతో ఓ పథకాన్ని తెలంగాణ ప్రవేశపెట్టడం కొసమెరుపు..