దేశ రాజధాని ఢిల్లీలో సిఏఏ పై ఆందోళనలు ఉదృతంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఒకేవైపు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనలో ఉండగా ..ఢిల్లీ ఒక్కసారిగా ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటికే దాదాపుగా 13 మంది మృత్యువాత పడ్డారు. పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం , ఆందోళన కారులు పలువురు పోలీసులపైనే దాడులకు పాల్పడుతుండటంతో .. పరిస్థితి చేజాదాటిపోతుంది అని భావించి, పారామిలటరీ బలగాలని , పెద్ద సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు.
ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే, ఇదే సమయంలో ప్రైవేట్ టీవీ చానెల్స్‌కు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. మంగళవారం రాత్రి ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెల్స్ ఈ క్రింది సూచనలు పాటించాలని ఆదేశాలు జారీచేసింది.
ఆ దేశాలలో భాగంగా ..ముఖ్యంగా దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా టీవీ కార్యక్రమాలు ఉండకూడదు. అందుకు సంబంధించిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయకూడదని, ఇక, ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించ పర్చేలా ఉన్న వీడియోలు గానీ.. పదాలను గానీ టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్రసారం చేయకూడదని ఆదేశించింది. మరోవైపు, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు.. ఆయా వ్యక్తులకు భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదని తెలిపింది.