ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లోనే ప్రజలు, బాగా డబ్బున్నవారు నివసించాలనుకుంటారు. అలాంటి దేశాల్లో అయితేనే తమ మాన ప్రాణాలకు, తాము సంపాదించుకున్న డబ్బుకు భద్రత చేకూరుతుందని భావిస్తారు. ప్రపంచంలో సురక్షిత దేశాల్లో ఉండటానికి మిలియనీర్లు, బిలియనీర్లు మొగ్గు చూపుతున్నారు. ఆ దేశాల్లో పౌరసత్వం సంపాదించడానికి భారీ ఎత్తున ధనాన్ని ఖర్చు చేస్తున్నారు.
కాగా ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ నిలిచింది. 96 పాయింట్లతో సింగపూర్ ప్రపంచంలోనే సురక్షిత దేశంగా టాప్ ర్యాంకు దక్కించుకుంది. ఈ ఏడాదికి గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ.. 'గాలప్'..లా అండ్ ఆర్డర్ విడుదల చేసిన ఇండెక్స్‌లో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో సింగపూర్ తర్వాత.. తజికిస్థాన్, నార్వే, స్విట్జర్లాండ్, ఇండోనేషియా అత్యంత సురక్షిత దేశాలుగా నిలిచాయి. మొత్తం 120 దేశాలను ర్యాంకింగ్ కోసం పరిశీలించారు. ఈ 120 దేశాల్లో భారత్ 80 పాయింట్లు సాధించి సురక్షిత దేశాల జాబితాలో 60వ స్థానంలో నిలిచింది.
పాయింట్ల పరంగా శ్రీలంక, పాకిస్థాన్‌తో పోల్చుకుంటే భారత్ పాయింట్లకు స్వల్ప తేడానే కనిపించడం గమనార్హం. అయితే భారత్ కంటే యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) దిగువన ఉండటం గమనార్హం.
కాగా జాబితాలో ఆప్ఘనిస్తాన్ అట్టడుగున 120వ స్థానంలో నిలిచింది. గతేడాది ఆప్ఘనిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబన్లు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారి పాలనలో ఆ దేశం చివరి స్థానంలో నిలిచింది.
అఫ్గాన్ తర్వాత కింది నుంచి ఐదు స్థానాల్లో గాబన్, వెనిజువెలా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్ నిలిచాయి.
ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారు..? గత ఏడాది జరిగిన దాడులు, దోపిడీల తీవ్రత తదితర అంశాల ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.