ఇప్పుడు దేశం మొత్తం కొవిడ్ సెకండ్ వేవ్ ధాటికి హడలెత్తిపోతోంది. ఎక్కడ తమకు కరోనా అంటుకుంటుందో అని జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పొరపాటున కరోనా అంటిందంటే.. పై ప్రాణాలు పైన్నే పోతున్నాయి చాలా మందికి! కానీ.. కొవిడ్ సోకిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేసిన పని చూసి ఐఏఎస్ అధికారి అమితాశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. అతడి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఒడిశాలోని కులాంగే జిల్లా పరిధిలోని ఓ ఆసుపత్రిని తనిఖీ చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ వెళ్లారు. అయితే.. ఆసుపత్రిలో అందరినీ పరిశీలిస్తూ వెళ్తుండగా.. ఓ బెడ్ దగ్గర సడన్ గా ఆగిపోయారు. ఆ బెడ్ పై కూర్చున్న కొవిడ్ బాధితుడు సీరియస్ గా తనపని తాను చేసుకుంటున్నారు. అతని చుట్టూ పుస్తకాలు ఉన్నాయి. ఓ కాలిక్యులేటర్ ఉంది. చేతిలో పెన్నుతో ఏవేవో రాసుకుంటున్నాడు. ఇది చూసిన ఐఏఎస్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
వివరాలు ఆరాతీస్తే.. అతడు ఓ చార్టెడ్ అకౌంట్ విద్యార్థిగా తేలింది. ఆ విద్యార్థి తాను రాయాల్సిన సీఏ పరీక్ష కోసం చదువుతున్నాడు. అతనికి కొవిడ్ వచ్చిందన్న బాధే కాదు.. అసలు ఆలోచన కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు సదరు ఐఏఎస్. సదరు విద్యార్థి.. తనకు కరోనా వచ్చిందన్న ఆలోచనే లేకుండా.. భవిష్యత్ పై ఆశాభావంతో చదువుకుంటున్నాడని, అందరూ ఇదేవిధంగా ఉండాలని ట్వీట్ చేశారు.
ఈ పోస్టు.. సదరు విద్యార్థి ఫొటో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టు చూసిన వారంతా అతన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. అతని ఆలోచని విధానాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. 'మీరు కొవిడ్ ను మాత్రమే కాదు.. సీఏను కూడా గెలుస్తారు..' అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.