వైద్యులకు కరోనా తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వాస్తవానికి ఇపుడు ప్రపంచానికి వారే దేవుళ్లు. నిర్విరామంగా తమ కుటుంబాలను త్యాగం చేసి పనిచేస్తున్నారు. ఒక్కక్కరు 12-24 గంటలు కూడా డ్యూటీ చేసిన వాళ్లు ఉన్నారు. అయితే.. తేడా వ్యక్తులు అందరిలో ఉంటారు కదా. అలాగే ఓ డాక్టరు కరోనా వైద్యం చేయడానికి నిరాకరించి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశారు. ఝార్కండ్ కి చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడు టిర్కి... తనను కరోనా వార్డులో వేశారని రాజీనామా చేశాడు. అక్కడే ఆయన భార్య సౌమ్య కూడా డాక్టరు. ఇద్దరినీ కరోనా వార్డులో వేశారు. తమకెక్కడ కరోనా వస్తుందో అని భయపడి వారిద్దరు ఒక ఆలోచన చేశారు. రాజీనామా చేస్తే తప్పించుకోవచ్చు కదా అనుకున్నారు. అంతే మెయిల్లోనే రాజీనామా లేఖను పంపి... వాట్సప్ లో కూడా ఓ కాపీ పెట్టారు. ఇది ఝార్కండ్ లోని ఝంషెడ్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది.
ఎవరైనా ఎపుడైనా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసే హక్కు ఉంటుంది గాని కొన్ని ప్రత్యేక పరిమితులకు కట్టుబడి మాత్రమే అది సాధ్యం. సాధారణ పరిస్థితుల్లో అయితే వారి రాజీనామాలు సులువుగా ఆమోదం పొందేవి. అయితే, ప్రజలు అతిపెద్ద ముప్పులో ఉన్నపుడు ఈ దేశంలో సదుపాయాలను ఉపయోగించుకుని వైద్యుడు అయిన వ్యక్తి సమాజానికి కష్టం వచ్చినపుడు తప్పించుకోవడానికి చట్టాలు ఒప్పుకోవు. వారి మీద ఝార్ఖండ్ ఎపిడమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తామని ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ నితిన్ మదన్ హెచ్చరించారు. అంతేకాదు.. వారి డాక్టరు లైసెన్సును రద్దు చేస్తే జీవితంలో వారు ఇంకెక్కడా వైద్యుడిగా పనిచేయలేని పరిస్థితి వస్తుంది.
చట్టం దెబ్బకు వారు దిగొచ్చారు. మాకు కరోనా వార్డులో చేయకూడదని ఏమీ లేదని... తన భార్య సౌమ్యకు అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల ఆమెకు రోగనిరోధక శక్తి తక్కువని వెంటనే కరోనా సోకితే ఆమెకు కోలుకునే అవకాశం కూడా ఉండదని టిర్కీ కొత్త వాదన వినిపించారు. అయినా నేను విధుల్లో చేరతాను. కరోనా వార్డులో పనిచేస్తాం. కరోనా తగ్గాకే మేము రాజీనామా చేస్తాం. కానీ మా బాధ అంతా... మమ్మల్ని టార్గెట్ చేసి కరోనా వార్డులో వేశారు. ఇతర డాక్టర్లు ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా తనను అందులో వేశారని వాపోయారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు చేరేటపుడు ఒక ఒప్పంద పత్రం మీద సంతకం చేస్తారు. అందులో ఏముంటుందో తెలుసా... వెసులుబాటు కోసమే టైమింగ్స్ అని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాస్తవానికి 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉన్నట్టేనని సంతకం పెట్టించుకుంటారు. అంతేకాకుండా ప్రకృతివిప్తతుల్లో ప్రభుత్వ ఆదేశాలతో ఇంటిమేషన్ లేకుండా సెలవులు రద్దవుతాయని కూడా అందులో రాసి ఉంటుంది. మరి డాక్టరు గారు దాన్ని సరిగ్గా చదివినట్టు లేదు.