ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సర్కారీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఇప్పటికే 70 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఒక్క యూపీనే కాకుండా యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. కేవలం ప్రభుత్వం, స్థానిక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు పైలోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కాస్తంత ఆలస్యంగా మేల్కొన్న యోగీ ఆదిత్యనాథ్ సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసినా... మరోవైపు చిన్నారుల మరణాలు మాత్రం ఆగడం లేదు. ఓ వైపు చిన్నారుల మరణాలతో ఆ ఆసుపత్రి ప్రాంగణం తల్లిదండ్రుల ఆర్తనాదాలతో మారుమోగుతుండగా, మరోవైపు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆసుపత్రి వైద్యులు మాత్రం నానా యాతన పడుతున్నారట. ఈ క్రమంలో వారు సినిమాల్లో మాదిరిగా చనిపోయిన చిన్నారులకు సైతం చికిత్సలు చేస్తూ యోగీ సర్కారుకు మరింతగా చెడ్డపేరు తెచ్చేస్తున్నారన్న వాదన లేకపోలేదు.
మన తెలుగు సినిమా ఠాగూర్ లో చనిపోయిన శవానికి చికిత్స చేసిన చందంగా గోరఖ్ పూర్ ఆసుపత్రి వైద్యులు కూడా ఓ చనిపోయిన చిన్నారికి చికిత్స అందించిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు చనిపోయిన చిన్నారి తండ్రి చేసిన ఈ ఆరోపణకు యోగీ సర్కారు ఏం సమాధానం చెబుతుందో చూడాలి. ఆసుపత్రి వైద్యులు - సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఖుషీ అనే చిన్నారి తండ్రి మహ్మద్ జహీర్ ఆరోపించారు. తన కూతురు చనిపోయినా... వైద్యులు తమ తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో చికిత్స కొనసాగించారని ఆయన ఆరోపించారు. మహ్మద్ ఆరోపణల వివరాల్లోకి వెళితే... బీఆర్ డీ ఆస్పత్రికి తన ఐదేళ్ల పాప ఖుషీని ఆగస్టు 10న తీసుకువచ్చారు. ఆక్సిజన్ అందక పాప చనిపోయిందని వైద్యులు తెలిపారు. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం పాప చనిపోయినట్లు ధ్రువీకరించలేదు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో.. వారు పాప మృతిని ప్రకటించకుండా ఆలస్యం చేశారు. పాపకు ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా నిలిపివేశారట. అంబు పంప్ ఇచ్చి చేతితో నొక్కుతూ ఆక్సిజన్ అందేలా చూసుకోమని చెప్పివెళ్లారు. కాసేపటికే పాప చనిపోయినట్లు తమకు తెలుస్తోంది. ఆమె శరీరమంతా చల్లగా మారిపోయింది. అయితే వైద్యులు మాత్రం వెంటనే చిన్నారి మృతిని ధ్రువీకరించలేదు. బయట మీడియా సిబ్బంది ఉండటంతో చనిపోయిన తన పాపకు వైద్యం చేస్తున్నట్లు నటించారని మహ్మద్ తెలిపారు. తన కూతురు 6 గంటలకు చనిపోతే.. అందరూ వెళ్లిపోయాక రాత్రి 10 గంటలకు చనిపోయినట్లు ప్రకటించారని మహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. కూతురిని డాక్టర్ చేయాలని తనకు కల ఉండేదని జహీర్ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇది ఇలా ఉండగా, మరో చిన్నారి తండ్రి ఆరోజు జరిగిన ఘటన గురించి వివరిస్తూ.. తన పాప ముక్కులోంచి రక్తం వస్తుందని వైద్యులకు చెబితే.. రక్తం కాదు అది ముక్కులోని మలినాలు బయటకు వస్తున్నాయని, కంగారు ఏమీ లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చాలామంది చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయి ఆస్పత్రిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.