దాదాపు 150 కు పైగా ప్రపంచ దేశాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న మహమ్మారి కరోనా వైరస్....మరిన్ని దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే కరోనాబారిన పడ్డ దేశాలలో వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందించడం తో పాటు....కరోనా సోకిందో లేదోనన్న టెస్టులు చేయడం వరకు వైద్యులంతా బిజీగా ఉన్నారు. కరోనా నుంచి బాధితలును కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు అకుంటిత దీక్షతో సేవలందిస్తున్నారు. కరోనా బారిన పడ్డవారికి చికిత్స అందించే క్రమంలో....ఆ వైరస్ గురించి మొట్టమొదటి వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ లీ తో పాటు మరికొందరు వైద్యులూ, వైద్య సిబ్బంది బలయ్యారు. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు ఆయా రంగాల వారికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రధాని మోడీ మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు.
ఆ కార్యక్రమాన్ని భారత ప్రజలు విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొందరు వ్యక్తులు....వైద్యులకు ధన్యవాదాలు తెలుపకపోగా...వారిపట్ల నిర్దయగా వ్యవహరిస్తున్న వైనం షాక్ కు గురిచేస్తోంది. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులను కొందరు మానవత్వం మరిచి ఇబ్బంది పెడుతున్నారు. తమ ఇళ్లలో అద్దెకుంటోన్న ఆ వైద్యులను ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఖాళా చేయాల్సిందిగా కొందరు చెబుతున్న వైనం తో ఆ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై వరంగల్ కు చెందిన డాక్టర్ ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
తాను వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా విధులు నిర్వర్తిస్తున్నానని, ఈ క్రమంలో కరోనా అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహించానని ఓ డాక్టర్ చెప్పారు. తనతో పాటు గత కొద్ది నెలలుగా మిగతా డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా నేపథ్యంలో రేయింబవళ్లు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ ఇంటి ఓనర్లు తమను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా చెబుతున్నారని ఆ డాక్టర్ వాపోయారు. తనతో పాటు నగరంలోని చాలామంది డాక్టర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇళ్లలో తాము ఉంటే...కరోనా వైరస్ సోకేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని సాకు చెబుతున్నారని, తమని కూడా వైరస్ సోకిన వారిలా వారు చూస్తున్నారని ఆ డాక్టర్ వాపోయారు. ఈ నేపథ్యంలో చాలా మంది డాక్టర్లు కట్టుబట్టల తో, లగేజీ తో రోడ్డునపడ్డారని చెప్పారు. ఇపుడు ఎక్కడకు వెళ్లాలో అర్థం కావడం లేదని అన్నారు.
తమ క్యాంపస్ లను కూడా కలెక్టర్ గారి ఆదేశాలతో ఐసోలేషన్ వార్డులుగా మార్చేశారని, ఆంధ్రాలో కూడా దాదాపుగా ఇవే పరిస్థితున్నాయని సదరు డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా అత్యాధునిక సురక్షణ పరికరాలు లేకుండా...సెలవులు కూడా పెట్టకుండా పని చేస్తున్నామని, గత ఐదు నెలలుగా స్టైపెండ్ కూడా రావడం లేదని అన్నారు. ఇంత రిస్క్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నందుకు తమకు దక్కిన ఫలితం ఇదేనని ఆవేదన వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున చప్పట్లు కొట్టింది ఇందుకేనా అని ఆ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. తమకు నిలువ నీడ లేకుండా చేసిన వారి కోసం తమ ప్రాణాలు ఎందుకు పణంగా పెట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటువంటి స్వార్థపరులైన ఇళ్ల యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని...నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి వారు చేసే పనుల వల్ల డాక్టర్ల మనోస్థైర్యం దెబ్బతింటుందని అంటున్నారు. మామూలుగానే డాక్టర్లు డెమీ గాడ్స్ అని...కరోనా విపత్తు సమయంలో డాక్టర్లే ప్రత్యక్ష దైవాలని...అటువంటి వారికి అన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై, ప్రజలపై ఉందని అంటున్నారు.