కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని తెంపల్లిలో వైద్యులు కొత్త వైరస్ ను గుర్తించారని వార్తలు వస్తున్నాయి. కుళాయిల ద్వారా సరఫరా అయిన నీటిలో క్లెబ్సియల్లా బ్యాక్టీరియాను గుర్తించారు. ఇది శరీర అవయవాలపై ఇది ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. అలాగే మెదడు, కాలేయం (లివర్), కళ్లుపై కూడా ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోనూ ఇన్పెక్షన్ ను కలిగిస్తుందని పేర్కొంటున్నారు.
కాగా ఒక్క వారంలోనే తెంపల్లిలోని ఊరు ఊరంతా అతిసార (కలరా) వ్యాధిన పడ్డారని మీడియా కథనాలు చెబుతున్నాయి. గ్రామంలో ఏ ఇంటిలో చూసినా అతిసార బాధితులే కనిపిస్తున్నారని సమాచారం.
గత వారం రోజుల నుంచి ప్రజలంతా వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని చెబుతున్నారు. వంద మందికిపైగా దీని బారినపడ్డారని అంటున్నారు. ఇప్పటికే ముగ్గురు మరణించారని పేర్కొంటున్నారు. మరో 30 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు.
బోర్ల నీటినే సంపులో ఎక్కించి అక్కడి నుంచి గ్రామం మొత్తానికి సరఫరా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పైపులైన్ల లీకుల కారణంగా మురుగు నీరు దానిలోకి చేరిందని చెబుతున్నారు. ఎన్నోసార్లు తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తెచ్చినా వారు పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ ఊరికి చేరుకున్న కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర అధికారులు ఇబ్బందులు పడ్డారు. రహదారులపైనే మురుగునీరంతా ఉండటంతో కాలు తీసి పెట్టే పరిస్థితి లేకపోయింది. ప్రస్తుతం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
జిల్లా వైద్య శాఖ అధికారి గీతాబాయి, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, డీపీవో తదితరులతో కలసి కలెక్టర్ తెంపల్లిలో పర్యటించారు. తెంపల్లిలో అతిసార వ్యాధికి తాగునీరే కారణమని కలెక్టర్ ప్రకటించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ లీలాకృష్ణపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెంపల్లికి కేటాయించిన రూ.32 లక్షలతో వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.