ప్రభుత్వాలకు సమస్యలు ఎదురయిన ప్రతిసారీ ఎవరో ఒకరు సీన్ లోకి వస్తారు.అధినేతకు మద్దతుగా ఉంటారు. తమ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగా టార్గెట్ చేసినా వాళ్లు ఒప్పుకోరు. ఆ విధంగా వైసీపీకి నయా ట్రబుల్ షూటర్ దొరికేశారు.
ఆయనే మంత్రి సీదిరి అప్పల్రాజు.వివాదాస్పద మంత్రి అంటే వైసీపీ పెద్దలకు కూడా సానుభూతి ఉంది.అందుకనే నిన్నటి శారదా పీఠం వివాదాన్ని పూర్తిగా సర్దుమణిగేలా చేసి,విశాఖ పోలీసులతో రాయబారాలు నడిపారు అన్న వాదన కూడా విపక్షం నుంచి ఉంది.ఇదే సమయంలో ఒకప్పుడు తమకు ట్రబుల్ షూటర్లుగా ఉన్న అంబటిని, రోజాను వైసీపీ ఎప్పుడో పక్కన బెట్టేసింది.వీళ్లకు మంత్రి పదవులు ఇవ్వకుండా సీదిరిలాంటి వెనుకబడిన సామాజికవర్గ నేతలకు పదవులు ఇచ్చి వైసీపీ తనదైన మార్కు రాజకీయం ఒకటి నడిపింది.
అయినా కూడా పార్టీ విధేయులుగా ఉన్న రోజా కానీ అంబటి కానీ సందర్భం వచ్చిన ప్రతిసారీ తమ గొంతుక వినిపించి, విపక్షాల వ్యాఖ్యలను తిప్పికొడుతూనే ఉన్నారు.కానీ వీళ్లంతా పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా, నొప్పించక తానొవ్వక అన్న ధోరణిలోనే మాట్లాడుతూ..మీడియా ఎదుట పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు.ఈ క్రమంలో సీదిరి సీన్లోకి రావడంతో ఇప్పుడు వైసీపీకి జనసేనకు కౌంటర్ ఇచ్చే నేత దొరికారు.ఈ నేపథ్యంలో జనసేనకు ఘాటుగా రిప్లై ఇచ్చే స్థాయిలో సీదిరిని రంగంలోకి దించిన అధిష్టానం పవన్ ను లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడండి అని ఆదేశాలు ఇచ్చింది అని తెలుస్తోంది.
ప్రస్తుతం జనసేన మత్స్యకార అభ్యున్నతి యాత్రను నిర్వహిస్తోంది.నిన్నటి వేళ ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన బృందం పర్యటించి,అక్కడ మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంది.ఇదే సమయంలో మంత్రి సీదిరి అప్పల్రాజు సీన్ లోకి వచ్చి జనసేనకు కౌంటర్లు ఇచ్చారు.తమ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొంటూ, సీన్లోకి వచ్చారు. పవన్ కల్యాణ్ ఎందుకని నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.తమ ప్రభుత్వం మత్స్యకారుల కోసం నాలుగు ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోందని పేర్కొంటూ సీన్లోకి వచ్చారు.ఆ విధంగా ఆయన జగన్ కు ట్రబుల్ షూటర్ అయ్యారు.
ఇవన్నీ బాగానే ఉన్నా మంత్రి సీదిరి మాటలను జనసేన అస్సలు వినిపించుకోవడంలేదు. తాగేందుకు గుక్కెడు నీరు లేని మత్స్యకార గ్రామాలు గోదావరి ఒడ్డున ఉన్నాయని, ముందు ఆ సమస్య పరిష్కరించాక తమను తిట్టాలని అంటున్నారు జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్.
ఏదేమయినప్పటికీ జనసేనకు ముందు ముందు కూడా సీదిరి మాత్రమే సరైన రీతిలో సమాధానాలు ఇవ్వగలరని,ఆయనొక్కరే సమర్ధుడు అని ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యలపై జనసేన పోరాడే సమయంలో కూడా ఇదే విధంగా కౌంటర్లు ఇవ్వాలని అధినాయకత్వం సీదిరికి సూచించిందని తెలుస్తోంది.అంటే ఇప్పుడు వైసీపీకి నయా ట్రబుల్ షూటర్ సీదిరి అప్పల్రాజే! అన్నది నిస్సందేహం.