నేటి కాలంలో ప్రతి పనికి ఆన్లైన్ అవసరం ఉంటుంది. ఏదైనా వస్తువు కొనాలన్నా.. అమ్మాలన్నా.. చివరిక ఆహారం తెచ్చుకోవాలన్న ప్రజలు ఆన్లైన్ కు అలవాటు పడ్డారు. ఇక రుణాల విషయంలోనూ చాలా మంది ఉద్యోగులు ఆన్లైన్ బ్యాంకులను సంప్రదిస్తున్నారు. మ్యానువల్ గా లోన్ ఇవ్వాలంటే ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అదే ఆన్లైన్లో అయితే క్షణాల్లో అకరౌంట్లో డబ్బులు వేస్తారు.
దీంతో కొన్ని బ్యాంకులు ఇస్తున్న ఆఫర్లతో కస్టమర్లు ఆకర్షితులై ఆన్లైన్ బ్యాంకింగ్ కు అలవాటు పడుతున్నారు. అయితే ఈక్రమంలో చాలా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. మన పేరు మీద మనకు తెలియకుండా చాలా మంది లోన్లు తీసుకునే అవకాశం ఉంది. ఇలా చాలా మంది మోసపోయారు. సాధారణ వ్యక్తులేకాకుండా సెలబ్రేటీలు సైతం తమ బ్యాంకు నుంచి ఇతరులు రుణం తీసుకొని వారితో ఇఎంఐ కట్టిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటి సన్నిలియోన్ బ్యాంకు అకౌంట్ ను హ్యాక్ చేసిన కొందరు ఆమె పేరు మీద రుణం తీసుకున్నారు. కొన్ని రోజుల తరువాత తన అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవడం చూసి ఆ నటి షాక్ తింది. దీంతో తాను మోసపోయానని తరువాత తెలుసుకుంది. అలాగే బాలీవుడ్ నటడు రాజ్ కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు తమ పర్సనల్ డాటాను షేర్ చేయడంలో జాగ్రత్తలు వహించాలని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. అయితే సన్నిలియోన్, రాజ్ కుమార్ నష్టపోయింది కొంతే అయినా వారి సిబిల్ స్కోర్ తగ్గిపోయింది. దీంతో వారు మరో రుణం తీసుకోవడానికి అర్హత కోల్పోయారు.
బ్యాంకులు పర్సనల్ లోన్ మంజూరు చేయడానికి ఎక్కువగా సిబిల్ స్కోర్ చూస్తుంటారు. దీని ప్రామాణికంగానే రుణాలు మంజూరు చేస్తాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఇచ్చే మూడంకెల సంఖ్యనే సిబిల్ స్కోర్ గా పరిగణిస్తారు. ఈ సంఖ్య 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈస్కోరు 900 పాయింట్లు ఉంటే తక్కువ వడ్డీ కింద ఎక్కువ రుణం వస్తుంది. ఈక్విఫాక్స్, ఎక్స పీరియన్స్ లేదా సీఆర్ఐఎఫ్ వంటి క్రెడిట్ బ్యూరోలు కూడా ఈ స్కోర్ ను అందిస్తుంటాయి.
అయితే స్కోర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని బ్యాంకింగ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ స్కోర్ తగ్గిందంటే మీకు ఏ బ్యాంకులోనైనా రుణావకాశాలు తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే కొందరు పర్సనల్ డాటాను చోరీ చేసి రుణాలు తీసుకొని ఎగ్గొట్టేస్తారు. ఈ ప్రభావం సదరు ఖాతాదారునిపై పడి అతని సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అంతేకాకుండా ఒక్కోసారి అకౌంట్ హ్యాక్ అయి ఉన్న డబ్బులు మొత్తం మాయం అయ్యే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. అందువల్ల ప్రతీ ఖాతాదారుడు తమ ఐడీ వివరాలు ఇతరులతో షేర్ చేసుకోవద్దని అంటున్నారు.
అలాగే స్కాన్ చేసిన ఆధార్, పాన్ కార్డు కాపీలను ఈమెయిల్ లో పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఈమెయిల్ నుంచి పాన్ కార్డు షేర్ చేయాల్సి వస్తే ఇంకోజినిటో మోడ్ లో బ్రౌజర్ ను వాడాలి. గుర్తింపు పత్రాల ఫొటోలను అటాచ్డ్ మాత్రమే చేయాలి. మెయిల్ లో పెట్టుకోవద్దు. పబ్లిక్ వైపై ఉపయోగించి ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేయొద్దని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.