రామోజీ హోటల్ మీద విశాఖలో నిరసన ర్యాలీ

Update: 2016-02-16 06:50 GMT
మీడియా మొఘల్.. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు సంబంధించిన ఒక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీడియా.. చిట్ ఫండ్.. హోటళ్లు.. వస్త్ర దుకాణాలు.. ప్రియా పచ్చళ్లు.. ఇలా చాలానే వ్యాపారాలు చేసే రామోజీకి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి డాల్ఫిన్ హోటల్ ఒకటి. ఈ హోటల్ కు సంబంధించిన ఉద్యోగులు విశాఖపట్నంలోని రోడ్ల మీద నిరసన ప్రదర్శన జరపటం ఇప్పుడు సంచలనంగా మారింది.

బయట ఏం జరిగినా నిజాన్ని నిర్భయంగా రాస్తానని ఈనాడు పత్రిక చెబుతోందని.. కానీ.. ఆ సంస్థకు చెందిన డాల్ఫిన్ హోటల్లో ఏం జరిగినా బయట పెట్టరెందుకు? అని ఉద్యోగులు పలువురు నిలదీయటం గమనార్హం. తాము ఎదుర్కొంటున్న సమస్యలు రామోజీరావుకు తెలీవా? అంటూ ప్రశ్నిస్తున్న కార్మికులు.. ఏళ్ల తరబడి హోటల్ లో పని చేస్తున్న కార్మికుల్ని యాజమాన్యం హింసిస్తోందని ఆరోపించారు.

కార్మికుల హక్కుల కోసం కమ్యూనిస్టు నేతలతో కలిసి కదం తొక్కిన వారు.. విశాఖ వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. ఇలాంటి సంఘటనలపై రామోజీ ఎలా రియాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News