అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాక్ కు గురయ్యే పరిణామం ఇది. ఆయన ఆదాయపు పన్ను దాఖలు వివరాలు లీక్ అయ్యాయి. 2005 సంవత్సరంలో సుమారు రూ.వెయ్యి కోట్ల ఆదాయంపై దాదాపు రూ.250 కోట్ల పన్ను చెల్లించినట్లు సమాచారం లీకైంది. అమెరికాకు చెందిన ఎమ్ ఎస్ ఎన్ బీసీ ఛానల్ ఈ సమాచారాన్ని బయటపెట్టింది. ట్రంప్ ఆదాయ పన్నుకు సంబంధించి రెండు పేజీల డేటాను లీక్ చేశారు. అందులో ఫెడరల్ ఆదాయం కింద రూ.34.7 కోట్లు - అల్టర్నేటివ్ మినిమమ్ ట్యాక్స్(ఏఎమ్ టీ) రూపంలో రూ.203 కోట్లు ట్రంప్ చెల్లించినట్లు సమాచారం ఉంది. సంపన్నవర్గాలు ఆదాయపన్ను మినహాయింపుల నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు ఏఎమ్ టీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
అయితే దేశాధ్యక్షుడి ఆదాయపన్ను వివరాలను వెల్లడించినందుకు వైట్ హౌజ్ ఆ టీవీ ఛానల్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రేటింగ్స్ కోసం టీవీ ఛానల్ చట్టాలను ఉల్లంఘిస్తున్నదని వైట్ హౌజ్ ఆరోపించింది. ఆదాయపన్ను వివరాలను వెల్లడించడం చట్టరీత్యా నేరమని వైట్ హౌజ్ స్పష్టం చేసింది. వాస్తవానికి ట్రంప్ ఆదాయపన్ను అంశం ఎన్నికల సమయంలో వివాదాస్పదమైంది. ట్రంప్ తన ఆదాయ పన్ను వివరాలను వెల్లడించడం లేదంటూ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఆదాయ వివరాలను వెల్లడించను అని ట్రంప్ కూడా అప్పుడు తేల్చిచెప్పారు.
ఇదిలాఉండగా ఫెడరల్ ట్యాక్స్ వివరాలు బయటకు రావడం అది చట్టరీత్యా నేరం. అయినప్పటికీ ఫెడరల్ ట్యాక్స్ అంశాలు లీక్ కావడం పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రజా ఆసక్తికర అంశం కింద ట్రంప్ ఆదాయ పన్ను వివరాలను ప్రకటించేందుకు ఎమ్ ఎస్ ఎన్ బీసీ ఛానల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓ గుర్తు తెలియన వ్యక్తి నుంచి ట్రంప్ ఆదాయ పన్ను వివరాలు తనకు అందినట్లు ఆ ఛానల్ జర్నలిస్టు తెలిపారు. వాస్తవానికి చట్టపరంగా ట్రంప్ తన ఆదాయంపై మరింత ఎక్కువే ట్యాక్స్ కట్టాల్సి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షులు ఎవరైనా తన ఆదాయ పన్ను వివరాలను వెల్లడించే చట్టాన్ని 1976లో రూపొందించారు. అయితే ఖచ్చితంగా ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/